Father’s request : మా అమ్మాయి టెడ్డీ బేర్ కనిపిస్తే దయ చేసి ఇవ్వండి అంటూ ఓ తండ్రి రిక్వెస్ట్

కొన్ని వస్తువులు మనకి చాలా అపురూపంగా ఉంటాయి. ఎందుకంటే వాటితో కొందరి జ్ఞాపకాలు ముడిపడి ఉంటాయి. ఓ స్టోర్‌లో మిస్ అయిన కూతురి టెడ్డీ బేర్ తిరిగి ఇవ్వాల్సిందిగా ఓ తండ్రి అభ్యర్ధిస్తున్నాడు. కారణం ఏమై ఉంటుంది? చదవండి.

Father’s request : మా అమ్మాయి టెడ్డీ బేర్ కనిపిస్తే దయ చేసి ఇవ్వండి అంటూ ఓ తండ్రి రిక్వెస్ట్

Father's request

Father’s request :  ఓ చిన్నారి ఆడుకునే టెడ్డీని అనుకోకుండా గుడ్ విల్ స్టోర్‌కి ఇచ్చేసారు. ఇప్పుడు అదే టెడ్డీ తిరిగి కావాలని ఆ చిన్నారి తండ్రి రిక్వెస్ట్ చేస్తున్నాడు. అదే టెడ్డీని కావాలని ఎందుకు అడుగుతున్నాడు. ఈ కథ వింటే మీ మనసు చలించిపోతుంది.

Great Father : కూతురి కోసం ఎంత కష్టమైనా సరే.. స్కూల్ ఈవెంట్‌లో వీల్ ఛైర్‌పై కూర్చుని డాన్స్ చేసిన తండ్రి

యుఎస్‌లోని టేనస్సీకి చెందిన టైలర్ కెన్నడీకి భార్యా, 4 ఏళ్ల కూతురు ఉన్నారు. ఆ చిన్నారి ఆడుకునే టెడ్డీ బేర్‌ను అనుకోకుండా గుడ్ విల్ స్టోర్ లో ఇచ్చేసారు. కొంతకాలానికి టైలర్ కెన్నడీ భార్య అనారోగ్యంతో చనిపోయింది. అయితే ఇప్పుడు గుడ్ విల్ స్టోర్‌కి ఇచ్చిన టెడ్డీని తిరిగి ఇవ్వాల్సిందిగా టైలర్ కెన్నడీ ఫేస్ బుక్‌లో అభ్యర్ధించాడు. ఆ టెడ్డీ బేర్‌ను తిరిగి ఇస్తే దాని ఖరీదు చెల్లిస్తానంటున్నాడు. అదే టెడ్డీ కావాలని కోరడానికి కారణం ఏంటంటే టెడ్డీ లోపల రికార్డైన  తన భార్య ‘హృదయ స్పందన’ ఉందని టైలర్ అంటున్నాడు. ఎలుగుబంటి పాదాలు నొక్కినపుడు తన భార్య గుండె శబ్దం వినిపిస్తుందని చెప్పాడు. అలా తన అత్తగారు తయారు చేయించారని అంటున్నాడు టైలర్ కెన్నడీ.

Man Fathered 550 Children : 550 మంది పిల్లలకు తండ్రి అయిన వ్యక్తికి షాకిచ్చిన కోర్టు .. రూ.కోటి జరిమానా

ఈ పోస్ట్ చూసిన గుడ్ విల్ స్టోర్ నిర్వాహకులు వెంటనే స్పందించారు. ఆ చిన్నారికి కొత్త బొమ్మను బహుమతిగా ఇచ్చారు. చిన్నారి తల్లి హృదయ స్పందనను ఇన్ స్టాల్ చేయించి మరి తిరిగి ఇచ్చారు. పాత టెడ్డీ దొరికే వరకూ అయినా ఆ కుటుంబం సంతోషంగా ఉండాలని ఈ పని చేసినట్లు స్టోర్ నిర్వాహకులు చెబుతున్నారు. పాత టెడ్డీ స్టోర్ లో ఎక్కడ ఉందో వెతికి ఇస్టామని స్పష్టం చేశారు. టెడ్డీ బేరే కదా అనుకుంటాం. కానీ ఆ కుటుంబానికి అది అపురూపం. ఆ చిన్నారి వద్దకు తల్లి తాలుకూ జ్ఞాపకమైన టెడ్డీ బేర్  తిరిగి చేరాలని కోరుకుందాం.