New Year 2025: నూతన సంవత్సరానికి స్వాగతం పలికిన న్యూజిలాండ్

న్యూ ఇయర్‌ కార్యక్రమాల్లో యువత ఎంతో ఉత్సాహంగా పాల్గొంటోంది.

happy-new-year-2025

న్యూజిలాండ్ నూతన సంవత్సరానికి స్వాగతం పలికింది. 2024కు బై బై చెప్పి 2025కు హలో చెప్పింది. ప్రపంచంలో మొట్టమొదటి నూతన సంవత్సర వేడుకలు న్యూజిలాండ్‌లో జరుగుతాయి. న్యూజిలాండ్ తర్వాత ఆస్ట్రేలియా ప్రజలు 2025 సంవత్సరానికి స్వాగతం పలికారు.

వీటితో పాటు పలు దేశాల్లోనూ న్యూ ఇయర్ ప్రారంభం కానుంది. ప్రపంచంలోని అన్ని దేశాల్లో విద్యుద్దీపాల నడుమ, బాణసంచా కాల్చుతూ, కేరింతలు కొడుతూ ప్రజలు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటున్నారు. న్యూ ఇయర్‌ కార్యక్రమాల్లో యువత ఎంతో ఉత్సాహంగా పాల్గొంటోంది.

వీటికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అంబరాన్నంటే ఆనందంతో కొత్త ఏడాదిని ప్రజలు ఆహ్వానించారు. బంధుమిత్రులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక ఇండియాలో కొత్త సంవత్సర వేడుకలకు భారీగా ఏర్పాట్లు జరిగాయి.

Yearly Horoscope 2025: ఈ ఏడాది మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసా? ఈ రాశి వారికి ఏడున్నర సంవత్సరాల శనిపీడ నుంచి రిలీఫ్