నేను గంజాయి తాగా.. న్యూజిలాండ్ ప్రధాని జసిందా సంచలన వ్యాఖ్యలు

  • Publish Date - October 2, 2020 / 11:46 AM IST

I used marijuana New Zealand Jacinda Ardern : ‘‘నేను గంజాయి తాగాను’’ అంటూ న్యూజిలాండ్ ప్రధానమంత్రి జసిందా ఆర్డెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2020 అక్టోబర్ 17న జరిగే సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సమయంలో జరిగిన చర్చలో ఆమె పాల్గొన్న ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. చర్చలో మోడరేటర్ మీరు ఎప్పుడైనా గంజాయిని ఉపయోగించారా అని ప్రశ్నకు జసిందా సమాధానం చెబుతూ ‘‘తాను యుక్త వయసులో ఉన్నప్పుడు గంజాయి తీసుకున్నానని’’ తెలిపారు. ఇప్పటివరకు జరిగిన ఎన్నికల ప్రచారంలో అత్యంత బలమైన..యానిమేటెడ్ నాయకుల చర్చలో జసిందా ఈ విషయాన్ని అంగీకరించటం సంచలనంగా మారింది.


కాగా న్యూజిలాండ్ లో ప్రస్తుతం గంజాయి చట్టవిరుద్ధం. కానీ దీన్ని చట్ట బద్ధం చేయాలనే డిమాండ్ చాలా కాలంగా న్యూజిలాండ్ లో కొనసాగుతోంది. ఈ క్రమంలో జసిందా చర్చలో ఈ విషయాన్ని బయటపెట్టారు. ఇది ప్రజాప్రాయ సేకరణగా పేర్కొన్న ఆమె గంజాయి విషయంలో ప్రజలే తేల్చుకోవాలని సూచించారు.


అలాగే ఈ చర్చలో భాగంగా తాను ఎప్పుడూ గంజాయిని తీసుకోలేదనీ ప్రత్యర్థి సంప్రదాయక జాతీయ పార్టీ నేత జుడిత్ కాలిన్సు వెల్లడించారు. గంజాయికి తాను వ్యతిరేకమని స్పష్టంచేశారు. అందుకే ప్రజలు కూడా తనకు మద్దతుగా ఓటు వేస్తారని తాను ఆశిస్తున్నానంటూ ధీమా వ్యక్తం చేశారు.



ఈ కార్యక్రమంలో జసిందా మాట్లాడుతూ..తాను మరోసారి ఎన్నికైతే.. పిల్లల పేదరికాన్ని నిర్మూలిస్తానని ఇప్పటికే తమ ప్రభుత్వం పేదరికాన్ని నిర్మూలన కోసం పలు చర్యలు చేపట్టిందనీ రానున్న కాలంలో దాన్ని మరింతగా నిర్మూలించేలా వ్యవహరిస్తామని హామీ ఇచ్చారు. బాలికలు..మహిళల ఆరోగ్యం కోసం పలు ఉత్పత్తుల్ని సబ్సిడీగా దిశగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు.


కాగా..యావత్ ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో జసిందా ఆర్డెన్ విజయం సాధించారు. ఆమె పాలనలో ప్రజాశ్రేయస్సు కలిగే కీలక నిర్ణయాలతో ప్రజల మన్ననలు పొందిన సంగతి తెలిసిందే. ప్రజలతో ఆమె కలిసిపోతారు. ఆమె ఏదైనా పర్యటనలో ఉన్నప్పుడు ప్రజలు ఆమెను గమనిస్తే సెల్ఫీలు అడగటం..ఆమె కూడా దానికి అంగీకరించి ప్రజలతో నవ్వుతూ మాట్లాడటం..సెల్పీలు తీసుకుంటుంటారు.అలా ఓ ప్రధాని ప్రజలతో కలుపుగోలుగా ఉండటం కూడా జసిందాకు కలిసి వచ్చే అవకాశమని చెప్పవచ్చు.




కాగా న్యూజిలాండ్ పూర్తిగా తగ్గిపోయిన కరోనా కేసులు మళ్లీ పెరగటంతో దేశంలో జరగాల్సిన ఎన్నికలు వాయిదా పడ్డాయి. 102 రోజుల తర్వాత మళ్లీ కొవిడ్‌ కేసులు నమోదవుతుండటంతో న్యూజిలాండ్‌లో సెప్టెంబర్‌ 19 నుంచి జరగాల్సిన ఎన్నికలను అక్టోబర్‌ 17 నాటికి వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు.

ట్రెండింగ్ వార్తలు