Indian Woman Abandoned in US: పెళ్లైన కొద్ది రోజులకే అమెరికా తీసుకెళ్లి వదిలేసిన భర్త.. ప్రైవేట్ పార్ట్ చెక్ చేస్తూ వేదింపులు

వరకట్న వేదింపులకు మరో యువతి జీవితం సందిగ్ధంలో పడిపోయింది. బీహార్ లోని పాట్నాకు చెందిన యువతి పెళ్లి చేసుకుని అమెరికాకు వెళ్లగానే అక్కడే వదిలిపెట్టేశాడు. ఎటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్ లేకుండానే విడిచిపెట్టాడు. తల్లిదండ్రులు ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండటంతో యువతి అత్తారింటికి ఫోన్ చేసింది.

Indian Woman Abandoned in US: పెళ్లైన కొద్ది రోజులకే అమెరికా తీసుకెళ్లి వదిలేసిన భర్త.. ప్రైవేట్ పార్ట్ చెక్ చేస్తూ వేదింపులు

United States Of America

Updated On : August 7, 2021 / 4:03 PM IST

Indian Woman Abandoned in US: వరకట్న వేదింపులకు మరో యువతి జీవితం సందిగ్ధంలో పడిపోయింది. బీహార్ లోని పాట్నాకు చెందిన యువతి పెళ్లి చేసుకుని అమెరికాకు వెళ్లగానే అక్కడే వదిలిపెట్టేశాడు. ఎటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్ లేకుండానే విడిచిపెట్టాడు. తల్లిదండ్రులు ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండటంతో యువతి అత్తారింటికి ఫోన్ చేసింది. అదనపు కట్నం ఇస్తేనే తాము సాయం చేస్తామని లేదంటే మాట్లాడేది లేదని ఫోన్ కట్ చేశారు. దిక్కుతోచని పరిస్థితుల్లో జూన్ 15న పోలీసులను సహాయం కోరింది. వాషింగ్టన్ డీసీలోని వర్జీనియా సబ్అర్బ్ కు చెందిన మెకలైన్ అపార్ట్‌మెంట్‌కు ఆమెను తీసుకెళ్లారు.

తన భర్తకు ఎఫ్-1 స్టూడెంట్ వీసా ఇచ్చిన యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ ను కూడా కలిసిందా యువతి. తనకు న్యాయం చేయాలని మొరపెట్టుకున్నా లాభం లేదు. నిరుత్సాహానికి గురై ఇండియా ప్రభుత్వ సీనియర్ అధికారులకు కంప్లైంట్ చేసింది. శాన్‌ఫ్రాన్సిస్కోలోని ఇండియన్ ఎంబస్సీకి ఇలా చెప్పింది.

‘నా భర్త ఎటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్ లేకుండా వదిలేశాడు. నాకు ఇక్కడ ఏం ప్లేస్ తెలీదు. ఇండియాలో ఉన్న నా పేరెంట్స్ సాయం కోసం మా అత్తారింటికి ఫోన్ చేస్తే ఎక్స్ ట్రా డబ్బులు కావాలని అడుగుతున్నారు’ అని చెప్పడంతో లోకల్ ఫెయిర్ ఫ్యాక్స్ కౌంటీ పోలీసులు కేసు రిజిష్టర్ చేసుకున్నారు. ప్రస్తుతం దీనిని క్రిమినల్ కంప్లైంట్ కింద పరిగణిస్తున్నారు.
‘యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు 2021 మార్చి 1న వచ్చి మెక్ లీన్, వర్జినీయా 22102 ప్రాంతంలో ఉన్నాం. వచ్చీ రావడంతోనే పేరెంట్స్ నుంచి డబ్బు తేవాలని డొమెస్టిక్ వయోలెన్స్ మొదలుపెట్టాడు’ అని చెప్పిందా యువతి.

ఫ్రెడ్డీ మ్యాక్ లో క్వాంటిటేటివ్ అనలిటిక్స్ ప్రొఫెషనల్ లో పనిచేస్తున్న ఆమె భర్తను అడగ్గా కావాలనే ఇలా ఇరికిస్తున్నారంటూ చెప్పుకొచ్చాడు. నువ్వు ఏ యూనివర్సిటీకి చెందిన స్టూడెంట్ వి అని ప్రశ్నిస్తే ముందుగా మ్యారీలాండ్ కాలేజీ క్యాంపస్ అని, తర్వాత బల్తీమోర్ క్యాంపస్ అని చెప్తూ ఫోన్ కట్ చేసేశాడు.

తన భర్తతో కలిసి ఉండే సమయంలో వాష్ రూం డోర్ ఓపెన్ గానే ఉంచాలని బలవంత పెట్టేవాడని వాపోయింది. వాష్ రూంకు వెళ్లినప్పుడు డోర్ ఓపెన్ గా ఉంచమనేవాడు. ప్రెగ్నెన్సీ రాకుండా నువ్వేదో చేస్తున్నావంటూ అనుమానించేవాడట. చాలా సార్లు నా ప్రైవేట్ పార్టును చెక్ చేశాడు. ఓ సారి ఫోన్ ఫ్లాష్ లైట్ తో, కొన్ని సార్లు చేతివేలితో, గ్లౌజు తొడుక్కుని ఇలా చేసేవాడు. సెక్స్ జరిగిన ప్రతీసారి ప్రెగ్నెన్సీ రాకుండా ఏదో చేస్తున్నావంటూ అరిచేవాడంటూ ఆరోపించింది.

సీటిల్ లోని దగ్గరి బంధువు వద్ద ఉంటుందా యువతి. చాలా సార్లు నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ ను కలిసి న్యాయం కోసం, ఆర్థిక సాయం కోసం తిరిగింది.

నన్ను ఒంటరిగా ఎక్కడికి వెళ్లనిచ్చేవాడు కాదు. కేవలం చెత్త పడేయడానికి మాత్రమే వెళ్లేదాన్ని. అది కూడా ఫోన్ పర్మిషన్ లేకుండానే. ప్రతీదానికి తనతో పాటు బలవంతంగా తీసుకెళ్లేవాడు. లేదంటే నాతో పాటు వచ్చేసేవాడు. ఓసారి తనకు క్షమాపణ చెప్పాల్సిందేనని పట్టుబట్టి మోకాళ్లపై నిల్చొనేలా చేశాడు. ఈ టార్చర్ గురించి ఎవరికైనా చెబితే జీవితమే లేకుండా చేస్తానంటూ బెదిరించాడు కూడా. అంటూ చెప్పుకొచ్చిందా వివాహిత.