Pakistan Blast: మోటార్‌సైకిల్‌తో ట్రక్కును ఢీకొట్టి.. పోలీసులు లక్ష్యంగా పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి.. తొమ్మిది మంది మృతి

పాకిస్థాన్‌లో పోలీసులు లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు దాడికి పాల్పడిన ఘటనలో తొమ్మిది మంది పోలీసులు మరణించడంతో పాటు మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Pakistan Blast: పాకిస్థాన్‌లో మరోసారి ఆత్మాహుతి బాంబు పేలుడు సంభవించింది. ఈసారి పోలీసులు లక్ష్యంగా ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. బలూచిస్థాన్ ప్రావిన్స్ రాజధాని క్వెట్టాకు తూర్పున 160 కి.మీ దూరంలో ఉన్న సిబ్బి పట్టణంలో ఈ దాడి జరిగింది. సోమవారం ఉదయం ఆత్మాహుతి బాంబర్ పోలీసు ట్రక్కుపైకి వేగంగా మోటార్‌ వాహనంపై దూసుకొచ్చాడు. దీనిని గమనించిన పోలీస్ అధికారులు అప్రమత్తమయ్యేలోపే ఆత్మాహుతి బాంబర్ ట్రక్‌ను ఢీకొట్టాడు. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి తొమ్మిది మంది పోలీసులు మరణించారు. ఈ విషయాన్ని పాకిస్థాన్ పోలీసు ప్రతినిధి ఒకరు రాయిటర్స్‌కు నివేదించారు.

Pakistan Blast: పెషావర్ పేలుడు ఘటనలో 70కి చేరిన మృతుల సంఖ్య.. శిథిలాల కింద మృతదేహాలు

పోలీసులు లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు దాడికి పాల్పడిన ఘటనలో తొమ్మిది మంది పోలీసులు మరణించడంతో పాటు మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే, వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పాక్ మీడియాలో కథనాలు వచ్చాయి. బాంబర్ మోటార్ సైకిల్‌తో ట్రక్కును ఢీకొట్టిన సమయంలో భారీ శబ్ధంతో పాటు వాహనం బోల్తాపడి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయని స్థానిక ప్రజలు తెలిపారు. ఈ ఘటనతో సిబ్బి అనే నగరంలో భయానక వాతావరణం నెలకొంది. ఈ ఆత్మాహుతి దాడికి ఏ ఉగ్రవాద సంస్థ ఇప్పటి వరకు బాధ్యత వహించలేదు.

Massive blast on Pakistan : పాక్‌లో బస్సుపై ఉగ్ర దాడి.. చైనా ఇంజినీర్లు సహా 10 మంది మృతి

పాకిస్థాన్‌లో వరుసగా ఆత్మాహుతి బాంబు పేలుళ్ల ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. గత నెలలో కరాచీలో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. నలుగురు పోలీసులు మరణించారు. గతంలో పెషావర్ లోని పోలీసు లైన్ కు సమీపంలో మసీదులో ఆత్మాహుతి బాంబు పేలుడు జరిగింది. 100మందికిపైగా మరణించారు. మృతుల్లో ఎక్కువ మంది పోలీసులే ఉన్నారు.

ట్రెండింగ్ వార్తలు