అమ్మా..నాకు చచ్చిపోవాలనుంది..నన్నెవరైనా చంపేయండి

మరుగుజ్జుతనం కూడా ఓ వైకల్యమే. అటువంటి మనుషుల్ని అవమానించటం అంగవైకల్యం కంటే ఘోరంమైనది. మరగుజ్జుతనంతో ఎన్నో అవమానాలకు భరిస్తూ..హేళనగా మాట్లాడూ శూలాలాంటి మాటల్ని వింటూ ఇక భరించలేక చచ్చిపోదామనుకున్నాడు తొమ్మిది సంవత్సరాల బాలుడు. దీంతో అమ్మా..నాకు బతకాలని లేదు..చచ్చిపోతాను..దయచేసి నేను చచ్చిపోవటానికి ఓ కత్తో..తాడో ఇవ్వు అని కన్నతల్లినే అడిగాడు. బిడ్డ మాటలు విన్న ఆ తల్లి తల్లడిల్లిపోయింది. తరువాత ఆ తల్లి ఏం చేసిందో తన బిడ్డ మానసిక వేదనని ప్రపంచానికి ఎలా తెలియజేసిందో చూద్దాం.
ఆస్ట్రేలియాలోని బ్రిస్‌బేస్‌కు చెందిన క్వాడెన్ కు 9 సంవత్సరాలు. క్వాడెన్ అచాడ్రోపాల్సియా అనే వ్యాధితో బాధపడుతున్నాడు. తన పరిస్థితికి బాధగానే ఉన్నా క్వాడెన్ చదువుకోవడానికి స్కూల్ వెళ్తున్నాడు. కానీ స్కూల్లో తోటి విద్యార్దులు క్వెడెన్ ను చూసి గేలి చేసేవారు. హేళనగా మాట్లాడేవారు. అయినా చదువుకోవాలనే పట్టుదలతో క్వాడెన్ వారి మాటలు పట్టించుకునేవాడు కాదు.
కానీ విద్యార్ధుల ఆగడాలు పెరిగాయి. దారుణంగా అవమానించారు. ఆ మాటలు భరించలేని క్వెడెన్ బుధవారం (ఫిబ్రవరి 20,2020) ఇంటికి ఏడుస్తూ వచ్చాడు. అమ్మా..నాకు బతకాలని లేదు…ఈ బ్రతకు నాకు వద్దు..చచ్చిపోతాను ‘నాకు ఓ తాడు ఇవ్వు..ఉరేసుకుని చనిపోతాను. లేదా నన్ను ఎవరైనా నన్ను చంపేయండి’ అంటూ కన్నతల్లి ముందే భోరుమంటూ ఏడ్చాడు. బిడ్డ పరిస్థితి అర్థం చేసుకున్న తల్లి ఎంతగానో ఓదార్చింది. కానీ బాధ తీరలేదు.
దీంతో కొడుకు ఏడుస్తున్న దృశ్యాలను వీడియో తీసిన తల్లి యర్రాక.. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఆ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. వీడియో చూసి స్పందిస్తున్న నెటిజన్లు.. క్వాడెన్‌కు ధైర్యం చెబుతూ కామెంట్ చేస్తున్నారు. దీనిపై యర్రాక బైల్స్ స్పందిస్తూ.. ‘‘ మా అబ్బాయి అవమానాల పాలు కావటం కొత్తేమీ కాదు. అవమానాలు తట్టుకోలేక మూడు సంవత్సరాల క్రితం కూడా ఆత్మహత్యకు యత్నించాడు. తోటి విద్యార్దులు చేసే అవమానాలను సీక్రెట్‌గా..స్కూల్ ప్రిన్సిపల్‌కు చెప్పి ఊరుకునే దాన్ని. కానీ, ఓ పసివాడు పడుతున్న బాధను అందరూ తెలుసుకోవాలని, తల్లిదండ్రులు, పిల్లలు జాగ్రత్తపడాలని నేను వీడియోను పబ్లిక్ ముందు ఉంచాన’ని తెలిపింది.
Read More>>సన్నీ ఫోన్ నెంబర్ అడగలేదు…క్షమాపణ చెప్పాలన్న బాలీవుడ్ నటుడు