Nithyananda Kailasa PM Ranjitha : నిత్యానంద ‘కైలాస’ దేశానికి ప్రధానిగా నిత్యానందమయి అలియాస్ నటి రంజిత

అలనాటి హీరోయిన్ ఓ దేశానికి ప్రధాని అయ్యారు. నిత్యానంద స్వామి కైలాస దేశానికి నటి రంజిత నిత్యానంద ప్రియ శిష్యురాలు నిత్యానందమయి కైలాస దేశానికి ప్రధానమంత్రి అయ్యారు.

Nithyananda Swami Kailasa PM Ranjitha

Nithyananda Swami Kailasa PM Ranjitha : నిత్యానంద స్వామి (Nithyananda Swami) అంటేనే ఓ వివాదాస్పదం. ఓ సంచలనం. వివాదాల్లో చిక్కుకుని దేశం నుంచి పరాయై ఓకే ఓ ఐలాండ్ ను కొని దాన్నే తన దేశం ప్రకటించుకున్న స్వామి నిత్యానంద. తన దేశానికి ఓ సొంతంగా ఓ ప్రత్యేక కరెన్సీని కూడా క్రియేట్ చేసిన అమితానందస్వామి నిత్యానంద. అటువంటి నిత్యానందకు ప్రియ శిష్యురాలిగా పేరొంది వివాదాల్లో చిక్కుకున్న నటి రంజిత. తెలుగు సినిమాల్లో కూడా నటించిన రంజిత అప్పట్లో నిత్యానంద స్వామితో అత్యంత సన్నిహితంగా ఉన్న ఫోటోలు తెగ వైరల్ అయ్యాయి. అటువంటి రంజిత ఇప్పుడు ప్రధాని అయ్యింది. ఎన్నికల్లో పొల్గొనాల్సిన పనిలేదు..ఓటింగ్ జరిగాల్సిన పని అంతకంటే లేకుండా ఏకంగా నిత్యానంద క్రియేట్ చేసుకున్న దేశానికి ప్రధాని అయిపోయింది ‘నిత్యానందమయి’ (Nithyananda Mayi) అలియాస్ అలనాటి హీరోయిన్ రంజిత(actress Ranjitha). నిత్యానంద స్వామి(Nithyananda Swami)కి చేసిన సేవలకు దక్కిన ఫలితంగా ఈ ప్రధాని పదవి దక్కినట్లుగా తెలుస్తోంది. కైలాస దేశానికి రజంతి ప్రధాని కావటంతో ఆమె ఆదేశానికి తొలి మహిళా ప్రధాని అయి చరిత్ర సృష్టించింది అని కూడా అనుకోవచ్చు. ఓ మహిళా సన్యాసిని ప్రధాని కావటం విశేషం అని అనుకోవచ్చు.

నిత్యానంద స్వామి ఆశ్రమంలో ఎన్నో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయనే ఆరోపణలో కేసుల్లో ఇరుక్కున్న ఆ స్వామి దేశంనుంచి వెళ్లిపోయి ఓ ఐలాండ్ కొనేశారు. ఆ ఐలాండే తన దేశంగా ప్రకటిస్తు దానికి ‘కైలాస దేశం’గా పేరు పెట్టాడు. ఆ ద్వీపానికి అదేనండీ ఆ కైలాస దేశానికి అతని ప్రియ శిష్యురాలు ప్రధానిని కూడా చేశాడు. ఇటీవల కాలంలో నిత్యానంద స్వామి తీవ్ర అనారోగ్యానికి గురి అయ్యాడనే వార్తలు వచ్చాయి. పదుల సంఖ్యలో డాక్టర్లను పెట్టుకుని చికిత్స పొందుతున్నాడనే వార్తలు వచ్చాయి. మరి అతని ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలీదుగానీ..తాజాగా నటి రంజితను ‘కైలాస’ దేశానికి ప్రధానమంత్రిగా ప్రకటించారు. యునైటెట్ స్టేట్స్ ఆఫ్ కైలాస (కైలాస దేశ) (United States Of Kailasa)అని పేరు పెట్టుకున్న దేశానికి రంజిత (Nithyananda Swami)ప్రధాని (PM) అయ్యింది. ఆమెపేరు ఇప్పుడు నిత్యానందమయి(Nithyananda Swami)..

కైలాస దేశానికి ప్రత్యేక కరెన్సీ, ప్రత్యేక పాలనను కూడా ఏర్పాటు చేసుకున్న స్వామిగా నిత్యానంద వార్తల్లో నిలిచారు. ఎన్నో వివాదాలు..మరోన్నో ఆరోపణల్లో చిక్కుకున్న నిత్యానం తరచు వార్తల్లో నిలుస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా నిత్యానంద కైలాస దేశం నిత్యానందమయి అలియాస్ రంజిత ప్రధాని కావటంతో ఆ దేశంలో మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ విషయాన్ని నిత్యానంద వెబ్‌సైట్‌లోనూ ప్రకటించారని పేర్కొనడం కూడా గమనించాల్సిన విషయం..

నిత్యానంద వెబ్ సైట్ లో నిత్యానంద.. రంజిత ఫొటోలు మాత్రమే ఉన్నాయి. మాజీ నటి తనని తాను ‘నిత్యానందమయ స్వామి’ అని పేర్కొంది. నటిగా రంజిత తెలుగు, తమిళం, కన్నడ చిత్రాల్లో నటించింది. ఎంతో మంది అభిమానులకు సొంత చేసుకుంది. కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే నిత్యానంద చెంతకు చేరింది. అతి తక్కువ కాలంలోనే నిత్యానందకు ప్రియ శిష్యురాలు అయ్యింది. అలా రంజితతో పాటు ఆమె సోదరి కూడా నిత్యానంద చెంతనే ఉందట.

కాగా ఇటీవల కౌలాస దేశం తరపున ఐక్యరాజ్య సమితి (United Nations)సమావేశంలో మహిళా రాయమారులు పాల్గొన్న విషయం తెలిసిందే.ఇటీవల కౌలాస దేశం తరుపున ఐక్యరాజ్య సమితి సమావేశంలో మహిళా రాయబారులు పాల్గొన్న విషయం తెలిసిందే. కైలాస్ (United States Of Kailasa) కు చెందిన ప్రతినిధి  ఐక్యరాజస్య సమితి నిర్వహించిన ఒక సదస్సులో ప్రత్యేక ఆకర్షణ దుస్తులతోను..ఆహార్యంతోను పాల్గొన్న ఫోటోలో తెగ వైరల్ అయ్యాయి. ఆ సమావేశంలో కైలాస దేశ రాయబారిగా వచ్చిన ప్రియా నిత్యానంద (Priya Nithyananda )మాట్లాడుతు భారతదేశం నిత్యానందను వేధిస్తోంది అంటూ ఆరోపించారు కూడా. కానీ ఐక్యరాజ్య సమితి మాత్రం ఆమె ఆరోపణలను పరిగణలోకి తీసుకోలేదు. పైగా యూఎన్ ను ప్రియా నిత్యానంద ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో పాల్గొన్న విషయంపై మీడియా ప్రశ్నించగా ఇది కేవలం ఒక సాధారణ సమావేశం అధికారిక సమావేశం కాదని ఇందులో ఎవరైనా మాట్లాడవచ్చని ప్రియా నిత్యానంద వ్యాఖ్యలను తాము పరిగణలోకి తీసుకోవట్లేదని క్లారిటీ ఇచ్చారు. కానీ కైలాస దేశానికి ఐక్యరాజ్య సమితి గుర్తింపు ఇచ్చినట్లుగా ఎక్కడా లేనట్లుగా తెలుస్తోంది.