US mechanic wins Rs.328 crores jackpot
US Lottery : ఏప్రిల్ 1వ తేదీన నిజం చెప్పినా ఏప్రిల్ పూల్ చేయటానికేమో అనుకుంటాం. అలాగే అనుకున్నాడు ఓమెకానిక్. ఏప్రిల్ 1వ తేదీన లాటరీ టికెట్ కొన్నాడు. దానికి రూ.328 కోట్లు లాటరీ తగిలింది. ఏప్రిల్ 1 తేదీన కొన్నాడు కాబట్టి అది తనను ఏప్రిల్ పూల్ చేయటానికే అలా చెబుతున్నాడనుకున్నాడు. నాకు లాటరీ తగిలిందా? పైగా జాక్ పాటా? నేను నమ్మాలా? అంటూ పకపకా నవ్వేశాడు. కానీ అది పూల్ చేయటానికి కాదని నిజమేనని తెలిసాక అతని ఆనందం అంతా ఇంతాకాదు..ఎగిరి గంతేశాడు 61 ఆ మెకానిక్ 6 ఏళ్ల పిల్లాడిలో తెగ సంబరపడిపోయాడు.
అమెరికాలోని అయోవా రాష్ట్రంలోని డబ్యూక్ నగరానికి చెందిన ఎర్ల్ లాపే అనే వ్యక్తి మెకానిక్ గా పనిచేసి రిటైర అయ్యాడు. లాపే వయస్సు 61 ఏళ్లు. లాపే ఏప్రిల్ ఫూల్స్ డే (ఏప్రిల్ 1 తేదీ) నాడు లొట్టో అమెరికా టికెట్ కొనుగోలు చేశారు. దానికి తాజాగా 40 మిలియన్ డాలర్ల బహుమతి లభించింది. భారత కరెన్సీలో సుమారు రూ.328 కోట్లు జాక్ పాట్ తగిలింది. కానీ అది జోక్ అనుకుని మొదట్లో లాపే నమ్మలేదు. కానీ అది నిజమని తెలిసి తెగ సంబరపడిపోయాడు.
దీని గురించి క్లైవ్‌లోని అయోవా లాటరీ కేంద్ర కార్యాలయంలో బహుమతిని తీసుకున్న సందర్భంగా లాపే మాట్లాడుతు..నేను ఏప్రిల్ పూల్స్ డే అంటే ఏప్రిల్ 1న లాటరీ టికెట్ కొన్నాను. దానికే జాక్ పాట్ తగులుతుందనే నేను అస్సలు ఊహించలేదు. అందుకే ఆ విషయం తెలిసాక కూడా అదో జోక్ అనుకున్నాను. ఏప్రిల్ ఫూల్ అవుతానేమోనని బిగ్గరగా నవ్వేశాను అంటూ చెప్పుకొచ్చాడు.
లాపే బహుమతి మొత్తాన్ని విడతలవారీగా ఒకేసారి తీసుకోవాలనుకున్నాడు. దీంతో ఆయనకు 21.28 మిలియన్ డాలర్లు (సుమారు రూ.174 కోట్లు) మాత్రమే లభించాయి. అలా కాకుండా విడదలవారీగా తీసుకుంటే మొత్తం 40 మిలియన్ డాలర్లు లభించేవి. కానీ లాపే తన అవసరాల కోసం మొత్తం అంతా ఒకేసారి తీసుకోవాలనుకోవటంతో 21.28 మిలియన్ డాలర్లు (సుమారు రూ.174 కోట్లు) మాత్రమే లభించాయి. అలాకాకుండా ఏడాదికి కొంత కొంతగా తీసుకుంటే 29 సంవత్సరాల్లో 40 మిలియన్ డాలర్లూ లభించేవి. కానీ అప్పటికే లాపేకి 61 ఏళ్లు వచ్చేశాయి. మరి మరో 29 ఏళ్లు అంటే ఏం జరుగుతుందో ఎవరు చెప్పగలరు? అని అనుకున్నాడేమో మొత్తం ఒకేసారి తీసుకోవాలనుకున్నాడు బహుమతి తక్కువగా వచ్చినా సరేనని..ఈ సొమ్మును కుటుంబ అవసరాలకు ఖర్చు చేయడంతోపాటు, ఆరోగ్య సమస్యలతో బాధపడే చిన్నారులను ఆదుకోవటానికి ఖర్చు పెడతానని తెలిపారు లాపే.