చికెన్ లో కరోనా ? WHO ఏమి చెప్పింది

  • Publish Date - August 15, 2020 / 09:15 AM IST

చికెన్ ద్వారా కరోనా వస్తుందనే ప్రచారంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించింది. ఫుడ్ ద్వారా లేదా ప్యాకేజింగ్ ద్వారా కరోనా సోకుతుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని డబ్ల్యూహెచ్ వో ఎమర్జెన్సీస్ ప్రొగ్రామ్ హెడ్ మైక్ ర్యాన్ స్పష్టం చేశారు. దీని ద్వారా ఒకరి నుంచి మరొకరికి కరోనా వ్యాప్తి చెందుతుందనడం తప్పని, ప్రజలు ఎలాంటి భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని ధైర్యం నింపే విధంగా ప్రకటన చేశారు.



ఫుడ్ విషయంలో ప్రజలు భయపవడొద్దని, ప్రాసెసింగ్, డెలివరీ గురించి ఆందోళన చెందాల్సిన అవసరమే లేదని మరోసారి స్పష్టం చేశారు. లక్షలాది ఫుడ్ ప్యాకెట్లను చైనా పరిశీలించిందని, కేవలం 10 లోపు ప్యాకేజీల్లోనే వైరస్ ఆనవాళ్లు గుర్తించారని డబ్ల్యూహెచ్ వో ఎపిడమియోలజిస్ట్ మరియా వాన్ కెర్ఖోన్ వెల్లడించారు.

చైనా నుంచి వచ్చిన ఈ రాకాసి ప్రపంచాన్ని ఇంకా గడగడలాడిస్తోంది. తాజాగా..చికెన్ లో కరోనా ఆనవాళ్లు ఉన్నాయంటూ..చైనా ఆరోపణలు గుప్పించడంతో మరోసారి షాక్ తిన్నారు. బ్రెజిల్ నుంచి వచ్చిన కంటెయినర్ లో చికెన్ వింగ్స్ లో కరోనా ఆనవాళ్లను గుర్తించామని చైనా ప్రకటించిన సంగతి తెలిసిందే.



దీంతో పలు దేశాలు స్పందిస్తున్నాయి. కరోనా ఆనవాళ్ల గురించి వివరణ కోరుతున్నామని బ్రెజిల్ వెల్లడించింది. కఠినమైన నియమాలు పాటిస్తున్నామని, కానీ దేశం దాటిన తర్వాత..వస్తువులకు ఏమవుతుందో తెలియదని ఈక్వెడార్ వెల్లడించింది. ఈ దేశం నుంచే భారీ ఎత్తున మాంసం ఉత్పత్తుల దిగుమతి అవుతున్నాయి.

ట్రెండింగ్ వార్తలు