Drug laws: డ్రగ్స్ చట్టాల్లో సడలింపులు.. మొదటిసారైతే జైల్లో పెట్టరు

కఠినమైన డ్రగ్ చట్టాలను సడలించింది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్.

UAE eases drug laws: కఠినమైన డ్రగ్ చట్టాలను సడలించింది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. గంజాయిలోని ప్రధాన మత్తు రసాయనమైన THC కలిగిన ఉత్పత్తులతో దేశంలోకి వచ్చే తీసుకొచ్చే ప్రయాణికులకు విధించే శిక్షలను సవరించింది. UAE అధికారిక గెజిట్‌లో కొత్త చట్టాన్ని అందుబాటులో ఉంచింది.

దేశంలోకి గంజాయితో తయారుచేసిన ఆహారం, పానీయాలు, ఇతర వస్తువులను తీసుకువెళుతున్నప్పుడు పట్టుబడినా కూడా మొదటిసారైతే మాత్రం జైలులో పెట్టరు. అయితే, అధికారులు ఉత్పత్తులను జప్తు చేసి నాశనం చేస్తారు.

గంజాయి నుంచి మాదక ద్రవ్యాలు, మత్తుమందులు మరియు యాంఫేటమిన్‌ల వంటి ఓవర్-ది-కౌంటర్ ఔషధాల వరకు వ్యక్తిగత ఉపయోగం కోసం దిగుమతి చేసుకునే విషయంలో ప్రపంచంలోని అత్యంత నిర్బంధిత దేశాలలో ఒకటిగా యూఏఈ ఉంది.

Afghanistan: 210 మందికి పైగా ఖైదీలను విడుదల చేసిన తాలిబాన్లు.. ఆందోళనలో ఆఫ్ఘాన్లు

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయంపై యూఏఈలో కఠినమైన ఆంక్షలు ఉండగా.. డ్రగ్స్‌ అక్రమ రవాణా చేసినా, వినియోగించినట్టు రుజువైనా నాలుగేళ్ల వరకు యూఏఈలో జైలు శిక్ష విధిస్తారు. పర్యాటకులు, పెట్టుబడిదారులకు ఆకర్షణీయమైన కాస్మోపాలిటన్ హబ్‌గా యూఏఈ తన ఇమేజ్‌ను పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నందున చట్టపరమైన సవరణ చేసింది.

ట్రెండింగ్ వార్తలు