Miss Universe: మోడళ్లకు గుడ్‌న్యూస్.. మిస్ యూనివర్స్ పోటీలకు గరిష్ఠ వయోపరిమితి ఇకపై..

ఇప్పటివరకు ఇందులో పాల్గొనే అమ్మాయిల వయసు 18-28 మధ్య ఉండాలన్న నిబంధన కొనసాగింది. గత ఏడాది బోనీ గ్యాబ్రియెల్ వయసు 28 ఏళ్లు కావడంతో ఈ పోటీలో పాల్గొనే అవకాశం దక్కింది.

Miss Universe: మోడళ్లకు గుడ్‌న్యూస్.. మిస్ యూనివర్స్ పోటీలకు గరిష్ఠ వయోపరిమితి ఇకపై..

Miss Universe

Updated On : September 14, 2023 / 7:31 PM IST

Miss Universe – Age limit: మిస్ యూనివర్స్ పోటీలకు 2024 నుంచి గరిష్ఠ వయోపరిమితిని ఎత్తేస్తున్నారు. విమెన్స్ వెర్ డైలీ న్యూస్ జర్నల్‌లో ఇందుకు సంబంధించిన వివరాలు తెలిపారు. 2022 విశ్వ సుందరి బోనీ గ్యాబ్రియెల్ (29) తాజాగా 2023 న్యూయార్క్ ఫ్యాషన్ వీక్‌లో పాల్గొని ఈ విషయాన్ని వెల్లడించింది. 71 ఏళ్ల క్రితం (1952లో) మిస్ యూనివర్స్ పోటీలు మొదటిసారి నిర్వహించారు.

అప్పటి నుంచి ఇప్పటివరకు కనిష్ఠ-గరిష్ఠ వయోపరిమితి ఉంది. ఇందులో పాల్గొనే అమ్మాయిల వయసు 18-28 మధ్య ఉండాలి. 2024 నుంచి మోడళ్ల వయసు 28 దాటినా ఇందులో పాల్గొనవచ్చు. ప్రస్తుత విశ్వ సుందరిగా బోనీ గ్యాబ్రియెల్ ఉన్నారు.

గత ఏడాది బోనీ గ్యాబ్రియెల్ వయసు 28 ఏళ్లు కావడంతో ఈ పోటీలో పాల్గొనే అవకాశం దక్కింది. అదే తనకు చివరి అవకాశం అనుకుంది. అందులోనే విజేతగా నిలిచింది. ఇప్పుడు ఆమె వయసు 29 ఏళ్లు. విశ్వ సుందరి హోదాలో అత్యధిక వయసు ఉన్న మోడల్ ఆమె.

గత ఏడాది విశ్వ సుందరి పోటీల్లో పాల్గొన్న సమయంలో ప్రశ్న-జవాబుల సెగ్మెంట్లో ఆమె ఓ సూచన చేసింది. మిస్ యూనివర్స్ పోటీల అభివృద్ధి కోసం గరిష్ఠ వయోపరిమితిని ఎత్తేయాలని చెప్పింది. ఇప్పుడు నిర్వాహకులు అదే పని చేశారు. కాగా, 2023 మిస్ యూనివర్స్ పోటీలు ఈ ఏడాది నవంబరులో జరుగుతాయి. ఈ ఏడాది మాత్రం ఇందులో పాల్గొనే మోడళ్ల వయసు 18-28 మధ్య ఉండాలి.

Sodara Sodarimanulara Review : సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ.. అక్రమంగా కేసులో ఇరికిస్తే..?