Birds Dropping Gone In Mexico
Birds Mystery Death In Mexico : ఆకాశంలో ఆనందంగా ఎగిరే వందాలాది పక్షుల గంపు ఏమైందో ఏమోగానీ నేలపైకి రాలి చనిపోయిన విషాదం మెక్సికోలో చోటుచేసుకుంది. ఫిబ్రవరి 7న చివావాలో పసుపు తల ఉన్న నల్ల రంగు పక్షుల గుంపు ఒక్కసారిగా ఒక ఇంటి సమీపంలో కిందకు దిగింది. గుంపులోని చాలా పక్షులు తిరిగి ఎగిరిపోయాయి,. కానీ వందల సంఖ్యలో పక్షులు మాత్రం చచ్చిపడి ఉన్నాయి. ఆ దారి అంతా ఎక్కడ పడితే అక్కడ రోడ్డుపై చనిపోయి పడి ఉన్న వందలాది పక్షులు కనిపించటంతో ఏం జరిగిందా? అని అనిపిస్తోంది.
Also read : Helmet to Children : కొత్త రూల్..ఇకపై పిల్లలకు కూడా హెల్మెట్ తప్పనిసరి..
సోమవారం (ఫిబ్రవరి 14,2022) ఉదయం 8.20 గంటలకు జరిగిన ఈ అనూహ్య ఘటనను గమనించిన స్థానికులు ఆశ్చర్యపోయారు. చనిపోయిన పడి ఉన్న పక్షుల్ని చూసి బాధపడ్డారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పక్షులు ఇలా చనిపోయి పడి ఉండటంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పశువైద్యులు కూడా పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. పక్షులు విష వాయువు పీల్చి ఉంటాయని లేదా వేడి వల్ల లేదా హైటెన్షన్ విద్యుత్ లైన్ తగలడం వల్ల కాని గుంపులోని కొన్ని పక్షులు మరణించి ఉంటాయని భావిస్తున్నారు.
Also read : Elon Musk : చిన్నారుల ఆకలి తీర్చేందుకు.. ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద విరాళం.
పక్షులు మిస్టరీ డెత్ లకు కారణం 5జీ కూడా కారణం కావచ్చని కొంతమంది సోషల్ మీడియాలో ఊదరగొడుతున్నారు.ఈ ఊహాగానాలతో సోషల్ మీడియా పక్షుల మృతికి సంబంధించి ఫోటోలో వైరల్ గా మారాయి. ఈ ప్రాంతంలోని సీసీ టీవీలో పక్షులు అక్కడ వాలటం చనిపోవటం సీన్లు రికార్డు అయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
WARNING: GRAPHIC CONTENT
Security footage shows a flock of yellow-headed blackbirds drop dead in the northern Mexican state of Chihuahua pic.twitter.com/mR4Zhh979K
— Reuters (@Reuters) February 14, 2022