Elon Musk : చిన్నారుల ఆకలి తీర్చేందుకు.. ప్రపంచ చ‌రిత్రలోనే అతిపెద్ద విరాళం.

గ‌తేడాది నవంబర్ 19 నుంచి నవంబర్ 29 వరకు తన ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ నుంచి 45 వేలకు పైగా విరాళంగా ఇచ్చినట్లు చూపారు...ఇది ప్రపంచ చ‌రిత్రలోనే అతిపెద్ద విరాళం...

Elon Musk : చిన్నారుల ఆకలి తీర్చేందుకు.. ప్రపంచ చ‌రిత్రలోనే అతిపెద్ద విరాళం.

Elon Musk

Updated On : February 16, 2022 / 2:38 PM IST

Elon Musk Gifted $5.7 Billion Worth Of Tesla Inc : ఎల‌క్ట్రిక్ కార్ల త‌యారీ సంస్థ టెస్లా సీఈవో ఎలన్‌ మస్క్‌… 50 లక్షల షేర్లను విరాళంగా అంద‌జేశారు. ప్రపంచ‌దేశాల్లోని చిన్నారుల ఆక‌లి తీర్చేందుకు బిలియ‌నీర్లు ముందుకు రావాల‌న్న ఐక్యరాజ్యస‌మితి పిలుపునకు ఎల‌న్‌మ‌స్క్ సానుకూలంగా స్పందించారు. ఈ విష‌యాన్ని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్‌లో దాఖలు చేసిన ఫైలింగ్‌లో తెలిపారు. గ‌తేడాది నవంబర్ 19 నుంచి నవంబర్ 29 వరకు తన ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ నుంచి 45 వేలకు పైగా విరాళంగా ఇచ్చినట్లు చూపారు. ఆ షేర్ల స‌గ‌టు ధ‌ర నాటి ప్రకారం 570 కోట్ల డాల‌ర్లు ఉంటుంద‌ని అంచ‌నా. ఇది ప్రపంచ చ‌రిత్రలోనే అతిపెద్ద విరాళం.

Read More : చిన్నారుల కోసం ఎలాన్ మస్క్ భారీ విరాళం

ఎల‌న్ మ‌స్క్ విరాళం అంద‌జేసిన స్వచ్ఛంద సంస్థ పేరేమిట‌న్న విష‌య‌మై స్పష్టత‌నివ్వలేదు. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ క‌మిష‌న్‌లో స‌మ‌ర్పించిన ఫైలింగ్‌లోనూ మ‌స్క్ ఆ వివ‌రాలు వెల్లడించ‌లేదు. బిలియ‌నీర్లు త‌లుచుకుంటే కోట్ల మంది నిరుపేద‌ల ఆక‌లి తీర్చొచ్చని ఐక్యరాజ్య సమితి వ‌ర‌ల్డ్ ఫుడ్ ప్రోగ్రాం డైరెక్టర్ డేవిడ్ బేస్లే కొన్ని రోజుల క్రితం కామెంట్‌ చేశారు. 4.2 కోట్ల మంది ఆక‌లి తీర్చడానికి 45 వేల కోట్లు అవ‌స‌రమన్నారు. దీంతో ఎలన్ మస్క్ స్పందించారు. ప్రణాళికేమిటో చెప్పడంతోపాటు ఆ నిధులు ఎలా స‌ద్వినియోగం చేస్తారో వెల్లడిస్తే 600 కోట్ల డాల‌ర్ల విలువ చేసే షేర్ల విక్రయానికి సిద్ధమన్నారు. చెప్పినట్టుగానే త‌న కంపెనీ షేర్లను విరాళంగా అంద‌జేశారు. ఐక్యరాజ్య సమితి ఏజెన్సీ చేసిన ట్వీట్ పై కూడా మస్క్ గతంలోనే స్పందించారు. గతంలో ఇచ్చిన మాట మేరకు ఆయన ఇప్పుడు చేసి చూపించారు. ఎలన్ మస్క్ పై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది. మాట నిలబెట్టుకున్నారంటూ కొనియాడుతున్నారు.