Plane Crash Lorry : హైవే రోడ్డుపై ట్రక్కును ఢీకొట్టిన విమానం.. పైలట్ మృతి

నార్త్ కరోలినాలో హైవే రోడ్డుపై విమానం కుప్పకూలింది. రోడ్డుపై వెళ్లే భారీ ట్రక్కును విమానం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పైలట్ అక్కడిక్కడే దుర్మరణం చెందాడు.

North Carolina Pilot Dead After Plane And Lorry Crash On I 85 In North Carolina

Plane Crash Lorry : నార్త్ కరోలినాలో హైవే రోడ్డుపై విమానం కుప్పకూలింది. రోడ్డుపై వెళ్లే భారీ ట్రక్కును విమానం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పైలట్ అక్కడిక్కడే దుర్మరణం చెందాడు. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) ప్రకారం.. షార్లెట్‌కు ఈశాన్యంగా 50 మైళ్ల దూరంలో డేవిడ్‌సన్ కౌంటీ విమానాశ్రయానికి సమీపంలో ఉన్న I-85 సౌత్‌లో డ్యూయల్ ఇంజిన్ బీచ్‌క్రాఫ్ట్ బారన్ విమానం భారీ ట్రక్కును ఢీకొట్టింది.

స్థానిక కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం 5.35 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. విమానం ఎయిర్‌పోర్ట్ నుంచి టేకాఫ్ అవుతున్న సమయంలో ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక నివేదికలు చెబుతున్నాయి. ఈ ప్రమాద ఘటనపై ఇప్పటికే FAA దర్యాప్తు ప్రారంభించింది. నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (NTSB)తో కలిసి దర్యాప్తు చేస్తోంది.

స్థానిక నివేదికల ప్రకారం.. విమానం ఢీకొట్టడంతో ట్రక్కు డ్రైవర్‌ స్వల్ప గాయపడినట్టు తెలుస్తోంది. ఆ క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం సమీపంలోని విన్‌స్టన్-సేలంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఘటనా స్థలంలోని ఫుటేజీ ద్వారా దర్యాప్తు కొనసాగుతోంది. విమానం లారీ ట్రక్కును ఢీకొట్టడంతో పెద్దఎత్తున మంటలు వ్యాపించాయి.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి. మరణించిన పైలట్ షార్లెట్‌కు చెందిన రేమండ్ జాన్ అక్లీ (43)గా గుర్తించారు. విమానం క్రాష్‌కు గల కారణాలేంటో ఇంకా స్పష్టంగా తెలియలేదని అధికారులు తెలిపారు. విమానం ఢీకొట్టడంతో ట్రాక్టర్-ట్రైలర్ బోల్తా పడి రోడ్డుపైకి దూసుకెళ్లిందని హైవే పెట్రోలింగ్ తెలిపింది.

Read Also : పాక్ విమాన ప్రమాదంలో 97మంది మృతి…క్రాష్ అయ్యేముందు మేడే, మేడే అన్న పైలట్