North korea Missile : వరుస మిస్సైల్ ప్రయోగాలతో కవ్విస్తున్న కిమ్..ఆందోళనలో దక్షిణకొరియా

ఉత్తరకొరియా విషయంలో అమెరికా హెచ్చరికలే నిజమవుతున్నాయా..? వరుస మిస్సైల్ ప్రయోగాలతో దక్షిణ కొరియాకు కాబోయే అధ్యక్షుడికి సవాల్ విసురుతోందా..? రేపో మాపో అణుపరీక్షలూ జరపనుందా..? అంటే అవుననే అంటోంది సియోల్ అధికార యంత్రాంగం.

North korea Missile : ఉత్తరకొరియా విషయంలో అమెరికా హెచ్చరికలే నిజమవుతున్నాయా..? వరుస మిస్సైల్ ప్రయోగాలతో దక్షిణ కొరియాకు కాబోయే అధ్యక్షుడికి సవాల్ విసురుతోందా..? రేపో మాపో అణుపరీక్షలూ జరపనుందా..? అంటే అవుననే అంటోంది సియోల్ అధికార యంత్రాంగం. ఉత్తరకొరియా సబ్‌మెరైన్ నుంచి క్షిపణిని ప్రయోగించినట్టు వెల్లడించిన దక్షిణకొరియా అధికారులు….కిమ్ చర్యలపై ఆందోళన వ్యక్తంచేశారు.

నాలుగైదేళ్ల క్రితం అమెరికా, ఉత్తరకొరియా మధ్య యుద్ధం దాకా వెళ్లిన ఉద్రిక్త పరిస్థితులు…శాంతి చర్చల తర్వాత సద్దుమణిగాయి. యుద్దం ఆగిపోయినప్పటికీ…అమెరికా, దక్షిణకొరియా, జపాన్ వంటి దేశాలు ఉత్తరకొరియా కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచుతున్నాయి. ఈ క్రమంలోనే ఉత్తరకొరియా వరుస క్షిపణి పరీక్షలు చేపడుతున్న విషయం బయటికొస్తోంది. ఈ ఏడాది మొత్తం 15 క్షిపణి పరీక్షలు నిర్వహించింది ఉత్తరకొరియా. ఖండాంతర బాలిస్టిక్ మిస్సైల్ పరీక్ష కూడా ఇందులో ఉంది. 2017 తర్వాత ఉత్తరకొరియా ఈ క్షిపణిని పరీక్షించి చూడడం ఇదే మొదటిసారి. మొత్తం 15 క్షిపణి పరీక్షల్లో రెండు గత మూడు రోజుల వ్యవధిలో నిర్వహించినవే.

Also read : Russia Victory Day : విక్టరీ డే సెలబ్రేషన్స్ లో పుతిన్ ఏం ప్రకటించనున్నారు? ఉత్కంఠగా దృష్టి సారించిన ప్రపంచ దేశాలు
దక్షిణ కొరియా అధ్యక్షుడిగా యూన్ సుక్ యోల్ ప్రమాణం మంగళవారం ప్రమాణం చేయనున్నారు. శతృదేశం కొత్త అధ్యక్షుడికి క్షిపణులతో స్వాగతం చెప్పాలనుకుందో లేక దక్షిణకొరియాలో అధికారం చేతులు మారుతున్న వేళ తమ ఆయుధ సంపత్తిని బలంగా చాటాలనుకుందో తెలియదు కానీ…వరుసగా క్షిపణి దాడులు జరిపింది ఉత్తరకొరియా. దక్షిణ హంగ్‌యోంగ్‌లోని సిన్‌పో సముద్ర జలాల నుంచి SLMBగా పిలిచే బాలిస్టిక్ మిస్సైల్‌ను సబ్‌మెరైన్‌ను ఉత్తరకొరియా పరీక్షించినట్టు దక్షిణకొరియా తెలిపింది. సిన్‌పో ఉత్తరకొరియాకు అత్యంత కీలకమైన నౌకాకేంద్రం. దక్షిణకొరియాతో చర్చలకు సిద్ధంగా లేమని కొత్త అధ్యక్షుడికి సంకేతాలు పంపేందుకే ఈ క్షిపణి పరీక్షలకు కిమ్ ఆదేశించి ఉంటారని భావిస్తున్నారు. అలాగే యూన్ ప్రమాణస్వీకారోత్సవానికి హాజరవుతున్న బైడన్‌ను ఈ పరీక్షతో కిమ్ హెచ్చరించారనీ ప్రచారం జరుగుతోంది.

Also read : Russia Victory Day : రెండో ప్రపంచయుద్ధంలో నాజీలకు పట్టిన గతే యుక్రెయిన్ కు పడుతుంది : పుతిన్

మిస్సైల్ పరీక్షలే కాదని..ఉత్తరకొరియా అణ్వాయుధ పరీక్షలు జరిపేందుకు కూడా సన్నాహాలు చేసుకుంటోందని అమెరికా ఆరోపిస్తోంది. ఈ నెలలో ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా ఉత్తరకొరియా అణుపరీక్ష జరుపుతుందని అమెరికా తెలిపింది. గత వారం మిలటరీ పరేడ్ సందర్భంగా అణ్వాయుధ సామర్థ్యాన్ని వీలయినంత వేగంగా అభివృద్ధి చేసుకుంటామని, ముందస్తు దాడులు చేసే అవకాశముందనీ హెచ్చరించారు. ఇప్పటికే యుక్రెయిన్ యుద్ధంతో ప్రపంచమంతా ఆవేదన చెందుతున్న వేళ…ఇలా ఉత్తరకొరియా, దక్షిణ కొరియా మధ్య ఉద్రిక్తతలు తలెత్తడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.

ట్రెండింగ్ వార్తలు