Nuclear Weapons : ఉత్తర కొరియా అణ్వాయుధాలను అభివృద్ధి చేస్తోంది…యూఎన్ సంచలన నివేదిక

ఉత్తర కొరియా అణ్యాయుధాలను అభివృద్ధి చేస్తుందా ? అంటే అవునంటోంది ఐక్యరాజ్యసమితి. తాము హెచ్చరించినా ఉత్తర కొరియా అణ్వాయుధాలను అభివృద్ధి చేస్తూనే ఉందని ఐక్యరాజ్యసమితి తాజాగా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది....

Nuclear Weapons : ఉత్తర కొరియా అణ్యాయుధాలను అభివృద్ధి చేస్తుందా ? అంటే అవునంటోంది ఐక్యరాజ్యసమితి. తాము హెచ్చరించినా ఉత్తర కొరియా అణ్వాయుధాలను అభివృద్ధి చేస్తూనే ఉందని ఐక్యరాజ్యసమితి తాజాగా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. (North Korea Developing Nuclear Weapons) ప్యోంగ్యాంగ్ యొక్క అణు బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాలకు నిధులను నిలిపివేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ఐక్యరాజ్యసమితి ఆంక్షలను ఉత్తర కొరియా తప్పించుకుందని ఐక్యరాజ్యసమితి ప్రచురించిన నివేదిక తెలిపింది.

Prime Minister Narendra Modi : మణిపుర్‌పై మోదీకి అమెరికా గాయని మేరి మిల్‌బెన్ మద్ధతు

ఉత్తర కొరియా 2023వ సంవత్సరంలో అణ్వాయుధాలను అభివృద్ధి చేయడం, అణు విచ్ఛిత్తి పదార్థాలను ఉత్పత్తి చేయడం కొనసాగించిందని యూఎన్ పేర్కొంది. ఉత్తర కొరియా తన అణు క్షిపణి కార్యక్రమాలకు నిధులు సమకూర్చడానికి సైబర్ దాడులను ఉపయోగిస్తోందని గతంలో యూఎన్ ఆరోపించింది. కాగా హ్యాకింగ్ లేదా ఇతర సైబర్‌టాక్‌ల ఆరోపణలను ఉత్తర కొరియా ఖండించింది.

North Koreas Kim Jong Un : ఉత్తర కొరియా టాప్ జనరల్ డిస్మిస్…యుద్ధ సన్నాహాలకు కిమ్ జోంగ్ పిలుపు

అంతకుముందు గురువారం ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ మిలిటరీ టాప్ జనరల్‌ పోస్టును భర్తీ చేసి, యుద్ధానికి సన్నాహాలు చేయాలని పిలుపునిచ్చారు. ఉత్తర కొరియా కూడా ఆంక్షలను ఉల్లంఘించి 14 కొత్త నౌకలను కొనుగోలు చేసింది.

ట్రెండింగ్ వార్తలు