Big Deal : రైళ్లలో నుంచి బాలిస్టిక్ మిస్సైళ్లను ప్రయోగిస్తున్న ఉత్తరకొరియా

మిస్సైల్ ప్రయోగాల్లో ఉత్తర కొరియా వెనక్కి తగ్గడం లేదు. క్షిపణుల మీద క్షిపణులను ప్రయోగిస్తోంది. మిస్సైళ్ల ప్రయోగాల్లో కిమ్ దేశం దూకుడును చూసి ప్రపంచ దేశాలు సైతం వణికిపోతున్నాయి.

Ballistic Missiles From Trains : మిస్సైల్ ప్రయోగాల్లో ఉత్తర కొరియా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. క్షిపణుల మీద క్షిపణులను ప్రయోగిస్తోంది. మిస్సైళ్ల ప్రయోగాల్లో కిమ్ దేశం దూకుడును చూసి ప్రపంచ దేశాలు సైతం వణికిపోతున్నాయి. అణ్వాయిద ప్రయోగాలపైనే ఉత్తరకొరియా ఫోకస్ పెట్టడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటివరకూ ఏ దేశం ప్రయోగించని స్థాయిలో మిస్సైల్ ప్రయోగాలతో నియంత దేశం నార్త్ కొరియా దూసుకెళ్తోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా రైల్వే ఆధారిత వ్యవస్థను ఉపయోగించి రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లు ఉత్తర కొరియా వెల్లడించింది. రైల్వే ఆధారిత క్షిపణి ప్రయోగం ద్వారా ఉత్తర కొరియన్లు శత్రువులపై దాడిచేసేందుకు అనుకూలమైన మార్గమని భావిస్తోందని నివేదిక పేర్కొంది.

అంతేకాదు.. ఈ విధానం ద్వారా క్షిపణి ప్రయోగాలకు తక్కువ నిర్వాహణతోపాటు ఖర్చు చౌకగా ఉంటుందని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే ఈ తరహా క్షిపణులను దించేందుకు నార్త్ కొరియా రైల్వే ఆధారిత వ్యవస్థను ఎంచుకున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. ఉత్తర కొరియా మిలిటరీ రైల్వే మొబైల్ క్షిపణి రెజిమెంట్  (Railway Mobile Missile Regiment) ద్వారా ఈ ప్రయోగాలను నిర్వహించింది. మొట్ట మొదటిసారిగా రైల్వే మొబైల్ క్షిపణి వ్యవస్థ ద్వారా పరీక్షించింది. ఈ మిస్సైళ్లు ప్రయోగ కేంద్రం నుంచి దాదాపు 800కిలోమీటర్ల (500 మైళ్లు) వరకు ప్రయాణించినట్టు స్థానిక మీడియా వెల్లడించింది.
Cruise Missile : తగ్గేదేలే.. క్రూయిజ్ మిస్సైల్‌ను పరీక్షించిన ఉత్తర కొరియా!

సైనిక ఆపరేషన్ సమయంలో శక్తివంతంగా ఒకేసారి అనేక ప్రదేశాలలో క్షిపణుల ప్రయోగ సామర్థ్యాన్ని పెంచేందుకు రైల్వే మొబైల్ క్షిపణి రెజిమెంట్‌ను నిర్వహించింది. కొత్త రక్షణ వ్యూహంలో భాగంగా ఈ రైల్వే మొబైల్ క్షిపణి వ్యవస్థను ప్రవేశపెట్టినట్టు పేర్కొంది.

లాంచర్ సవరించిన బాక్స్‌కార్ లోపల ఉన్నట్టుగా కనిపిస్తుంది. క్షిపణికి కలిపిన లాంచర్ ఆర్మ్, పైకప్పు తెరుచుకున్న తర్వాత అది ప్రయోగ స్థానంలోకి నెమ్మదిగా కదులుతుంది. క్షిపణి రాకెట్ మోటార్ల నుంచి పేలినప్పుడు బయటకు వెళ్లేందుకు వీలుగా రెండు వైపులా తలుపులు తెరుచుకుంటాయి. ఈ క్షిపణుల ప్రయోగానికి సంబంధించి ఫొటోలు, వీడియోలు బయటకు విడుదల చేసింది. ఈ రైల్వే మొబైల్ క్షిపణి వ్యవస్థ.. ఏయే క్షిపణి లేదా క్షిపణులను లక్ష్యంగా ఛేదించగలదో స్పష్టత లేదు.


US మిలిటరీ KN-23 మాదిరిగా కనిపిస్తోంది. రష్యన్ ఇస్కాండర్‌ M షార్ట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణిని పోలి ఉన్నట్టు కనిపిస్తోంది. ఉత్తర కొరియా గతంలోనే KN-23 క్షిపణిని కూడా పరీక్షించింది. KN-23 పెద్ద క్షిపణి గత పరీక్షలలో 261 మైళ్ల నుంచి 280 మైళ్ల వరకు మాత్రమే ఎగిరినట్లు దక్షిణ కొరియా, జపాన్ అధికారులు అంచనా వేశారు. మిస్సైల్ ప్రయోగ సమయంలో 373 మైళ్ల దూరం ప్రయాణించాయని నివేదిక పేర్కొంది.

వీటితో పోలిస్తే.. ఈ రైలు-మొబైల్ క్షిపణుల పరిధి గణనీయంగా ఉంది. ఇతర క్షిపణుల కంటే ఎక్కువ రేంజ్ కలిగి ఉన్నాయి. రైల్వే మొబైల్ క్షిపణి వ్యవస్థ సమర్థవంతమైన కౌంటర్ స్ట్రైకింగ్ టూల్.. ఉత్తర కొరియాలో విస్తృతమైన రైలు మార్గాలు ఉన్నాయి. ప్రత్యేక రైళ్లను నిర్మించడంలో నార్త్ కొరియాకు అనుభవం ఉంది. అందులో నియంత కిమ్ జాంగ్ ఉన్ అంతర్గత సర్కిల్ సభ్యులు ఉపయోగించే ప్రత్యేక సాయుధ రైలు కూడా ఉందని నివేదిక తెలిపింది.
Kim Jong Un: కిమ్ డూప్లికేట్‌ను రెడీ చేసిన బార్బర్.. రిజల్ట్ చూసి షాక్ అవకండి

ట్రెండింగ్ వార్తలు