Cruise Missile : తగ్గేదేలే.. క్రూయిజ్ మిస్సైల్‌ను పరీక్షించిన ఉత్తర కొరియా!

ఉత్తర కొరియా మొట్టమొదటి వ్యూహత్మక క్రూయిజ్ మిస్సైల్ విజయవంతంగా పరీక్షించింది. ఈ క్షిపణికి సుదీర్ఘ దూరం ప్రయాణించగల సామర్థ్యం ఉంది. సుమారు 1500 కి.మీల దూరం లక్ష్యాన్ని చేరుకోగలదు.

Cruise Missile : తగ్గేదేలే.. క్రూయిజ్ మిస్సైల్‌ను పరీక్షించిన ఉత్తర కొరియా!

First 'strategic' Cruise Missile

North Korea First ‘strategic’ cruise missile : ఉత్తర కొరియా మొట్టమొదటి వ్యూహత్మక క్రూయిజ్ మిస్సైల్ విజయవంతంగా పరీక్షించింది. ఈ క్షిపణికి సుదీర్ఘ దూరం ప్రయాణించగల సామర్థ్యం ఉంది. సుమారు 1500 కిలోమీట‌ర్ల దూరం (930మైళ్లు) వ‌ర‌కు ఈ క్షిప‌ణి ప్ర‌యాణించ‌గ‌ల‌ద‌ని KCNA న్యూస్ ఏజెన్సీ తెలిపింది. నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోగల సామర్థ్యం ఈ ప్రత్యేకమైనదిగా తెలిపింది. అణు సామర్థ్యంతో రానున్న తొలి క్షిపణి కూడా ఇదే.. అలాగే జపాన్ తాకే సామ‌ర్థ్యం ఆ క్షిప‌ణికి ఉన్న‌ట్లు నివేదిక తెలిపింది. దేశీయ సరిహద్దు జలశయాల్లో ఈ ప్రయోగాన్ని చేపట్టినట్టు ఏజెన్సీ నివేదిక వెల్లడించింది.

లాంచ్ వెహికిల్ నుంచి ఈ క్రూయిజ్ మిస్సైల్‌ను ప‌రీక్షించిన‌ట్లు ఉత్త‌ర కొరియాకు చెందిన రొడాంగ్ సిన్‌మున్ ప‌త్రిక ఓ ఫొటోను రిలీజ్ చేసింది. ఆ క్షిప‌ణుల‌కు వ్యూహాత్మ‌క ప్రాముఖ్య‌తతో పనిచేస్తాయని KCNA నివేదిక‌లో తెలిపింది. శ‌ని, ఆదివారాల్లో మిస్సైల్ ప‌రీక్షలు జ‌రిగిన‌ట్లు సమాచారం.
UP Election : కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా ప్రియాంక గాంధీ ?

క్షిపణుల పరీక్షల్లో తగ్గని నార్త్ కొరియా :
ఆహార కొర‌త‌, ఆర్థిక సంక్షోభంతో అల్లాడిపోతున్న ఉత్తర కొరియా అత్యాధునిక ఆయుధాల‌ ప్రయోగంలో మాత్రం ఎంతమాత్రం తగ్గడం లేదు. ఒకవైపు ఆహారపు సంక్షోభం వెంటాడుతున్నప్పటికీ ఆయుధాలను పరీక్షిస్తూనే ఉంది. తాజాగా ఈ క్రూయిజ్ మిస్సైల్ ప్రయోగం ప‌ట్ల‌ అంత‌ర్జాతీయ స‌మాజం ఆందోళ‌నగా ఉందని అమెరికా మిలిట‌రీ వెల్లడించింది.

మరోవైపు జ‌పాన్ కూడా ఉత్తరకొరియా క్షిపణ పరీక్షలపై ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. లాంగ్ రేంజ్ క్రూయిజ్ మిస్సైల్ అణ్వాయుధాల‌ను కూడా మోసుకెళ్ల‌గ‌ల‌ సామర్థ్యం గలదని ఉత్త‌ర కొరియా విశ్లేష‌కులు అంకిత్ పాండా పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. క్రూయిజ్ క్షిపణిల కంటే బాలెస్టిక్ మిస్సైళ్ల‌తో ప్ర‌మాదం ఎక్కువ‌గా ఉంటుంద‌ని యూఎన్ భ‌ద్ర‌తా మండ‌లి (UN Nations Security Council) పేర్కొంది. ఉత్తర కొరియాతో విబేధాలను నివారించేందుకు అమెరికా, దక్షిణ కొరియా జపాన్ నుంచి టోక్యోలో సమావేశమైన ముందు రోజే ఉత్తరకొరియా ఈ పరీక్షను ప్రయోగించింది. మరోవైపు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి కూడా సియోల్‌లో పర్యటించారు. తన పర్యటనలో భాగంగా ప్రత్యర్ధి చుంగ్ యుయి-యోంగ్‌తో చర్చలు జరుపుతున్నారు.

NEET : ‘నీట్’ కు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ తీర్మానం