NEET : ‘నీట్’ కు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ తీర్మానం

తమిళనాడు సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. నీట్‌ పరీక్ష మాకొద్దంటూ తమిళనాడు విద్యార్థులకు శాశ్వత మినహాయింపు ఇవ్వాలని కోరుతూ అసెంబ్లీలో ప్రత్యేక బిల్లు ప్రవేశపెట్టింది.

NEET : ‘నీట్’ కు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ తీర్మానం

Neet (1)

తమిళనాడు సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. నేష‌న‌ల్ ఎలిజ‌బిలిటీ క‌మ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్‌) పరీక్ష మాకొద్దంటూ.. నీట్‌ నుంచి తమిళనాడు విద్యార్థులకు శాశ్వత మినహాయింపు ఇవ్వాలని కోరుతూ అసెంబ్లీలో ప్రత్యేక బిల్లు ప్రవేశపెట్టింది. అసెంబ్లీలో స్టాలిన్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు.. ప్రతిపక్ష పార్టీ అన్నాడీఎంకే సైతం మద్దతు తెలిపింది.

అయితే మొదటి నుంచి ఈ విషయంలో సరైన నిర్ణయం తీసుకోకపోవడానికి నిరసనగా సభ నుంచి అన్నాడీఎంకే సభ్యులు వాకౌట్ చేశారు. నీట్ కారణంగా తమకు అన్యాయం జరుగుతుందని భావించిన తమిళనాడుకు చెందిన విద్యార్థులు కొంతమంది ఆత్మహత్య కూడా చేసుకున్నారు. దీంతో నీట్ వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది.

NEET-UG : ఆ రోజునే ‘నీట్’ పరీక్ష

మెడికల్‌ సీట్ల భర్తీ కోసం .. దేశ వ్యాప్తంగా నిర్వహించే నీట్‌ పరీక్షకు వ్యతిరేకంగా .. తమిళనాడు అసెంబ్లీ తీర్మానం చేసింది. నీట్‌ నుంచి తమిళ విద్యార్థులకు మినహాయింపునివ్వాలని ప్రభుత్వం తీర్మానంలో చెప్పింది. ఇంటర్‌ ఫలితాలు ఆధారంగా మెడికల్‌ సీట్లు కేటాయించాలని .. స్టాలిన్‌ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది.