NEET-UG : ఆ రోజునే ‘నీట్’ పరీక్ష

షెడ్యూల్ ప్రకారమే 2021, సెప్టెంబర్ 12వ తేదీ ఆదివారం ‘నీట్’ పరీక్ష జరుగుతుందని సుప్రీంకోర్టు వెల్లడించింది.

NEET-UG : ఆ రోజునే ‘నీట్’ పరీక్ష

Neet

‘Neet’ Exam Test : షెడ్యూల్ ప్రకారమే 2021, సెప్టెంబర్ 12వ తేదీ ఆదివారం ‘నీట్’ పరీక్ష జరుగుతుందని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఈ పరీక్షను వాయిదా వేయాలని లేదా రీ షెడ్యూల్ చేయాలని కోరుతూ…సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లను సుప్రీం తోసిపుచ్చింది. ముందుగా ప్రకటించిన ప్రకారమే…పరీక్ష జరుగుతుందని తెలిపింది. సెప్టెంబర్ 12వ తేదీన నీట్ ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా…వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నీట్ (యూజీ) 2021 పరీక్షను నిర్వహిస్తారు.

Read More : Supreme Court : ట్రైబ్యునల్స్‌లో ఖాళీల భర్తీ వ్యవహారంలో కేంద్రంపై సుప్రీంకోర్టు ఆగ్రహం

అయితే..సెప్టెంబర్ 12వ తేదీన ఇతర పోటీ పరీక్షలు, సీబీఎస్ఈ (CBSE) కంపార్ట్ మెంట్ పరీక్షలు ఉండడంతో పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. పరీక్షను వాయిదా వేయాలని పిటిషన్లలో కోరారు. దీనిపై సుప్రీంకోర్టు 2021, సెప్టెంబర్ 06వ తేదీ సోమవారం స్పందించింది. పిటిషన్లను స్వీకరించడం లేదని, ఈ పరీక్షను 16 లక్షల మంది విద్యార్థులు రాస్తున్నారని తెలిపింది. కేవలం కొంతమంది విద్యార్థుల కోసం…పరీక్షను వాయిదా వేయలేమని, విద్యా వ్యవహారాలపై ఎక్కువగా జోక్యం చేసుకోలేమని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

Read More : CBI : సీబీఐ పని తీరుపై సుప్రీం ఆగ్రహం

తీర్పుల వల్ల లక్షలాది మంది విద్యార్థులు ప్రభావితమయ్యే అవకాశం ఉందని, ఎక్కువ పరీక్షలు ఉంటే..ఏదో ఒకదానిని ఎంచుకోవాలని సూచించింది.
కరోనా ప్రభావం కారణంగా..పరీక్షలు వాయిద పడిన సంగతి తెలిసిందే. నీట్ పరీక్ష కూడా పలుమార్లు వాయిదా వేస్తూ వస్తున్నారు. మేలో జరగాల్సిన పరీక్షలను కేంద్రం రద్దు చేసింది. నీట్ ను ఆగస్టు 01వ తేదీన నిర్వహిస్తామని గతంలో వెల్లడించింది. అప్పటికీ వైరస్ వ్యాప్తిలో ఎలాంటి మార్పు లేకపోవడంతో…షెడ్యూల్ లో మార్పులు చేసి సెప్టెంబర్ 12వ తేదీన నిర్వహిస్తామని వెల్లడించింది.