CBI : సీబీఐ పని తీరుపై సుప్రీం ఆగ్రహం

జమ్ము కశ్మీర్ లో ఇద్దరు లాయర్లు అరెస్టు కేసు విచారణలో భాగంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

CBI : సీబీఐ పని తీరుపై సుప్రీం ఆగ్రహం

Court

Supreme Court : సీబీఐ పని తీరుపై అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. సీబీఐ  కేసులు కోర్టుల్లో నిలబడే పరిస్థితి లేదని వ్యాఖ్యానించింది. జమ్ము కశ్మీర్ లో ఇద్దరు లాయర్లు అరెస్టు కేసు విచారణలో భాగంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేసుల విచారణపై ఆత్మపరిశీలన చేసుకోవాలని, ఇప్పటి వరకు ఎన్ని కేసులు చేపట్టారు ? ఎన్ని నిరూపించారని సూటీగా ప్రశ్నించింది. 2021, సెప్టెంబర్ 06వ తేదీ సోమవారం…సీబీఐ డైరెక్టర్ కు సుప్రీం నోటీసులు జారీ చేసింది. జస్టిస్ కౌల్, జస్టిస్ సందరేశ్ ధర్మాసనం ఈ నోటీసులు పంపించింది.

Read More : Anantapur : కాంట్రాక్టర్‌ను బెదిరించిన ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సన్నిహితుడు

గతంలో మద్రాసు హైకోర్టు వ్యాఖ్యలను ఈ సందర్భంగా సుప్రీం ప్రస్తావించింది. పంజరంలో చిలకకు స్వేచ్చ అవసరమని పేర్కొంది. సీబీఐ దర్యాప్తులో వచ్చే సమస్యలను తమ దృష్టికి తేవాలని సూచించింది. సిబ్బంది, వసతులు, ఇతరత్రా సమస్యలు ఉంటే తమకు చెప్పాలని సీబీఐ డైరెక్టర్ కు ఆదేశాలు జారీ చేసింది.

Read More : Pastor Assaults : చర్చికి వచ్చే యువతులపై పాస్టర్ లైంగికదాడి..మూడు పెళ్లిళ్లు చేసుకుని మోసం

గత కొన్ని రోజులుగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేస్తోంది. కేంద్రం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ట్రైబ్యునళ్లలో ఖాళీలు, నియామకాల వ్యవహారంలో మరోసారి అసహనం వ్యక్తం చేసింది. న్యాయస్థానం తీర్పులు, ఉత్తర్వులను కేంద్రం గౌరవించడం లేదని కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వం తమ అసహనాన్ని పరీక్షిస్తోందని, వారంలోగా కేంద్రం తమ తీరును మార్చుకోవాలని స్పష్టం చేసింది. దీనిపై తదుపరి విచారణనను ఈ నెల 13వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.