UP Election : కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా ప్రియాంక గాంధీ ?

ప్రియాంక నేతృత్వంలో ఎన్నికలకు వెళితే..ప్రయోజనకరంగా ఉంటుందని.. ఎన్నికల్లో ప్రజాదరణ ఉన్న నేత అయితే బెటర్ అని పార్టీ పెద్దలు భావిస్తున్నారు.

UP Election : కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా ప్రియాంక గాంధీ ?

Priyanka

Priyanka Gandhi : యూపీ ఎన్నికల్లో ఎలాగైనా అధికారం చేపట్టాలని కాంగ్రెస్ ఇప్పటి నుంచే వ్యూహరచనలు చేస్తోంది. అందులో భాగంగా ప్రియాంక గాంధీని ముందుకు తేవాలని ఆ పార్టీ భావిస్తోంది. ప్రియాంక నేతృత్వంలో ఎన్నికలకు వెళితే..ప్రయోజనకరంగా ఉంటుందని.. ఎన్నికల్లో ప్రజాదరణ ఉన్న నేత అయితే బెటర్ అని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. అంతేగాకుండా…సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశాన్ని పార్టీ భావిస్తోంది. ఈ విషయాన్ని…కాంగ్రెస్ సీనియర్ నేత, కాంగ్రెస్ మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ వెల్లడించడం హాట్ టాపిక్ అయ్యింది.

Read More : Priyanka Gandhi : జిమ్మేదార్ కౌన్..కేంద్రం కోవిడ్ లెక్కలపై ప్రియాంక ఫైర్

యూపీలో కాంగ్రెస్ గెలుపు కోసం ఆమె శ్రమిస్తున్నారని, సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందని వెల్లడించారాయన. ఇతర పార్టీలతో కలిపి కూటమి ఏర్పాటు చేస్తారనే ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఏ పార్టీతో కూటమి ఏర్పాటు చేయడం లేదని సల్మాన్ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు నిలబడుతారని, ఎవరైనా కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉంటే…వారిని సాదారంగా ఆహ్వానిస్తామని ప్రకటించారు.

Read More : ఎన్నికల బరిలోకి ప్రియాంక గాంధీ..కన్యాకుమారి నుంచి పోటీ!

గత కొద్ది రోజులుగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను టార్గెట్ చేస్తూ..ప్రియాంక విమర్శల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. అధికారమే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని ప్రియాంక ప్రయత్నిస్తున్నారు. ఆమె ఉత్తర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో పశ్చిమ ప్రాంత జిల్లాలకు ఇన్ ఛార్జీగా వ్యవహరిస్తున్నారు. సోషల్ మీడియాను ప్రధానంగా ఉపయోగిస్తున్న ప్రియాంక…ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. మూడు దశాబ్దాలుగా ఉత్తర్ ప్రదేశ్ లో అధికారానికి కాంగ్రెస్ దూరమైంది.

Read More : హత్రాస్ డ్రామా.. యూపీ పోలీసుల ఘర్షణలో కార్యకర్తలకు అండగా ప్రియాంకా వాద్రా

ఈసారి ప్రియాంకను బరిలోకి దించితే..మైనార్టీ ఓట్లతో పాటు…పెద్ద ఎత్తున మహిళా ఓటర్లు కాంగ్రెస్ కు పట్టం కడుతారని భావిస్తున్నారు. మొత్తం 403 అసెంబ్లీ స్థానాలున్న యూపీలో 2017 ఎన్నికల్లో బీజేపీ – 309, ఎస్పీ – 49, బీఎస్పీ – 18, కాంగ్రెస్ – 7, ఆప్నాదళ్ – 9 సీట్లు సాధించాయి. 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ – ఎస్పీ కూటమిగా కలిసి పోటీ చేసిన విషయం తెలిసిందే. మరి ప్రియాంకను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తారా ? ప్రకటిస్తే.. ఆ పార్టీకి మేలు జరుగుతుందా ? లేదా ? అనేది చూడాలి.