Kim Jong Un : పుతిన్‌ను కలిసేందుకు రష్యాకు రైలులో బయలుదేరిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్

ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మంగళవారం తెల్లవారుజామున సాయుధ రైలులో రష్యాకు బయలుదేరారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కలిసి ఆయుధ విక్రయాలపై కిమ్ జోంగ్ ముఖాముఖి చర్చలు జరుపుతారని ప్యోంగ్యాంగ్ వెల్లడించింది....

North Koreas Kim Jong Un

Kim Jong Un : ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మంగళవారం తెల్లవారుజామున సాయుధ రైలులో రష్యాకు బయలుదేరారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కలిసి ఆయుధ విక్రయాలపై కిమ్ జోంగ్ ముఖాముఖి చర్చలు జరుపుతారని ప్యోంగ్యాంగ్ వెల్లడించింది. (North Koreas Kim Jong Un) ఉక్రెయిన్‌లో మాస్కో యుద్ధం కోసం పుతిన్ ఉత్తర కొరియా నుంచి ఆర్టిలరీ షెల్స్ యాంటీ ట్యాంక్ క్షిపణులను కోరుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. (Russia to meet Putin)

Nipah virus : కేరళలో నిపా వైరస్ మహమ్మారి…ఇద్దరి మృతి

కిమ్ తన సైనికులు, సీనియర్ వ్యక్తులతో కలిసి రష్యా వెళ్లారని కొరియన్ వర్గాలు తెలిపాయి. కామ్రేడ్ కిమ్ జోంగ్ ఉన్ పర్యటన సందర్భంగా కామ్రేడ్ పుతిన్‌తో సమావేశమై చర్చలు జరుపుతారని ఉత్తర కొరియా అధికారులు చెప్పారు. కరోనావైరస్ మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి కిమ్ ఏ దేశంలోనూ ప్రయాణించలేదు.

IND VS PAK : కుల్దీప్ మాయ‌.. పాకిస్తాన్ పై 228 ప‌రుగుల భారీ తేడాతో భార‌త్ ఘ‌న విజ‌యం

ఉక్రెయిన్‌లో యుద్ధానికి మాస్కోకు ఆయుధాలను సరఫరా చేస్తే ప్యోంగ్యాంగ్ తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని వైట్ హౌస్ ఇటీవల హెచ్చరించింది. కిమ్ అంతర్జాతీయ పర్యటనల విషయానికి వస్తే రైలు ప్రయాణానికి ప్రాధాన్యతనిస్తారు. అతని తండ్రి కిమ్ జోంగ్ ఇల్ విమానాల్లో ప్రయాణాలకు భయపడ్డారు.

ట్రెండింగ్ వార్తలు