North Koreas Kim Jong Un
North Koreas Kim Jong Un : ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ఆ దేశ మిలిటరీ టాప్ జనరల్‌ను డిస్మిస్ చేశారు. అనంతరం యుద్ధానికి సమాయత్తం కావాలని ఉత్తర కొరియా ఆర్మీని ఆదేశించారు. ఆయుధాల ఉత్పత్తికి, సైనిక కసరత్తుల విస్తరణకు మరిన్ని సన్నాహాలు చేయాలని కిమ్ జోంగ్ పిలుపునిచ్చారు. (Calls For War Preparations) ఉత్తర కొరియా శత్రువులను అరికట్టడానికి ప్రతిఘటనల ప్రణాళికలను చర్చించిన సెంట్రల్ మిలిటరీ కమిషన్ సమావేశంలో కిమ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
FBI Raid : జో బిడెన్‌ను బెదిరించిన వ్యక్తి ఎఫ్‌బీఐ దాడుల్లో హతం
సైన్యం టాప్ జనరల్ స్థానంలో జనరల్ రి యోంగ్ గిల్ పేరు పెట్టారు. రక్షణ మంత్రిగా రి పాత్రను కొనసాగిస్తారా అనేది అస్పష్టంగా ఉంది. (North Koreas Kim Jong Un Dismisses Top General) కిమ్ (North Koreas Kim Jong Un) గత వారం ఆయుధ కర్మాగారాలను సందర్శించారు. ఆయుధ కర్మాగారాల్లో క్షిపణి ఇంజిన్లు, ఫిరంగులు, ఇతర ఆయుధాలు తయారు చేయాలని కిమ్ ఆదేశించారు.
Bidens order : చైనా టెక్నాలజీ పరిశ్రమల్లో అమెరికన్ పెట్టుబడులపై నిషేధాస్త్రం
కిమ్ కూడా ఆయుధాల ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరించే లక్ష్యాన్ని నిర్దేశించారని సమాచారం. ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధానికి ఆర్టిలరీ షెల్స్, రాకెట్లు, క్షిపణులతో సహా ఆయుధాలను ఉత్తర కొరియా అందజేస్తోందని అమెరికా ఆరోపించింది. కాగా రష్యా, ఉత్తర కొరియా ఆ వాదనలను ఖండించాయి. నార్త్ కొరియా సైనిక దళాలను పోరాటానికి సిద్ధంగా ఉంచేందుకు దేశంలో అత్యాధునిక ఆయుధాలు, పరికరాలతో కసరత్తులు నిర్వహించాలని కిమ్ పిలుపునిచ్చారు.
Hema Malini viral comment : రాహుల్ గాంధీ ఫ్లయింగ్ కిస్ చూడలేదు…ఎంపీ హేమమాలిని సంచలన వ్యాఖ్యలు
రిపబ్లిక్ స్థాపన దినోత్సవం 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 9వతేదీన ఉత్తర కొరియా మిలీషియా పరేడ్‌ను నిర్వహించనుంది. ఉత్తర కొరియా తన సైనిక బలగాలను బలోపేతం చేయడానికి వీలుగా పలు పారామిలిటరీ గ్రూపులున్నాయి. అమెరికా, దక్షిణ కొరియాలు ఆగస్టు 21, 24 తేదీల మధ్య మిలిటరీ డ్రిల్‌లను నిర్వహించనున్నాయి. ఈ మిలటరీ డ్రిల్ ఉత్తరాదిలో తన భద్రతకు ముప్పుగా నార్త్ కొరియా పరిగణిస్తోంది. ఇందులో భాగంగా ఉత్తర కొరియా అధినేత కిమ్ యుద్ధసన్నాహాల్లో మునిగారు.