Israel Iran Conflict
Israel Iran Conflict : ఇజ్రాయెల్-ఇరాన్ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో సైప్రస్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటిస్తున్నారు. మధ్యప్రాచ్యంలో రెండు ప్రాంతీయ అగ్రరాజ్యాల మధ్య వివాదం నాల్గవ రోజుకు చేరింది.
నికోసియాలో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించిన అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ.. “యుద్ధ యుగం కాదు” అనే సందేశంతో పునరుద్ఘాటించారు.
ఈ సందర్భంగా మానవత్వానికి శాంతి, స్థిరత్వం రెండూ అవసరమేనని ఆయన అన్నారు. సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్ తో సమావేశమైన ప్రధాని మోదీ మధ్యప్రాచ్యంలో సంఘర్షణలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు తెలిపారు.
“పశ్చిమ ఆసియా, యూరప్‌లలో జరుగుతున్న సంఘర్షణలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. ఈ వివాదంతో ప్రతికూల ప్రభావం ఆ ప్రాంతాలకే పరిమితం కాదు. ఇది యుద్ధ యుగం కాదు. చర్చల ద్వారా పరిష్కారించుకోవాల్సి అవసరం ఉంది” అని మోదీ అన్నారు.
పర్యటన షెడ్యూల్ ప్రకారం.. ఆదివారమే (జూన్ 15) మోడీ సైప్రస్ చేరుకున్నారు. 3 దేశాల పర్యటనలో భాగంగా మోదీ ప్రస్తుతం సైప్రస్‌లో పర్యటిస్తున్నారు. రెండు దశాబ్దాల తర్వాత భారత ప్రధాని సైప్రస్‌లో తొలిసారిగా పర్యటిస్తున్నారు. చర్చలకు ముందు అధ్యక్ష భవనం వద్దకు చేరుకున్న మోదీకి సాదర స్వాగతం లభించింది.
Read Also : Israel Iran War: అమెరికా రాయబార కార్యాలయాన్ని తాకిన ఇరాన్ మిస్సైల్.. దెబ్బతిన్న ఎంబసీ..
అనంతరం ఆ దేశాధ్యక్షుడు క్రిస్టోడౌలిడెస్‌తో ప్రధాని మోదీ ప్రతినిధి బృందం స్థాయి చర్చలు జరిపారు. చర్చల సమయంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పాల్గొన్నారు.
“ఈ పర్యటనతో భారత్-సైప్రస్ సంబంధాలకు ముఖ్యంగా వాణిజ్యం, పెట్టుబడి వంటి మరిన్ని రంగాలలో మరింత అభివృద్ధికి దోహదపడుతుందని సైప్రస్‌లో అడుగుపెట్టిన కొద్దిసేపటికే మోదీ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.