Alaska Airlines : గాల్లో దూసుకుపోతున్న విమానం ఇంజన్ ఆపటానికి యత్నించిన పైలట్ ..

విమానం 31,000 అడుగుల ఎత్తులో దూసుకుపోతున్న సమయంలో ఓ పైలట్‌ విమానం ఇంజన్ ఆపేందుకు యత్నించాడు. విమానంలో ఉన్నవారి ప్రాణాలను రిస్క్ లో పెట్టేందుకు యత్నించిన సదరు పైలట్ ను అరెస్ట్ చేశారు.

Alaska Airlines..Off duty pilot : అది అలాస్కా ఎయిర్ లైన్స్. వాషింగ్టన్ డీసీ నుంచి శాన్‌ఫ్రాన్‌సిస్కో వెళుతున్న అలాస్కా ఎయిర్‌లైన్స్‌ లో ఓ పైలట్ ఎవ్వరు ఊహించని పనికి పాల్పడబోయాడు. విమానం 31,000 అడుగుల ఎత్తులో దూసుకుపోతున్న సమయంలో ఓ ఆఫ్-డ్యూటీ‌ పైలట్‌ విమానం ఇంజన్ ఆపేందుకు యత్నించాడు. 44 ఏళ్ల జోసెఫ్ డేవిడ్ ఎమర్సన్ అనే ఆప్ డ్యూటీ పైలట్ ఆదివారం ఈ దారుణానికి పాల్పడబోయాడు. కానీ సకాలంలో పైలట్, కోపైలట్ స్పందించటంతో పెను ప్రమాదం తప్పింది. విమానం కాక్‌పిట్‌‌లోని జంప్ సీటులో కూర్చుని ప్రయాణిస్తున్న అతను సడెన్ గా లేచి విమానం ఇంజిన్లు ఆపేందుకు ప్రయత్నించాడు. కానీ క్షణకాలంలో విమానం పైలట్ కోపైలట్ స్పందించి అతనిని అడ్డుకోవటంతో పెను ప్రమాదం తప్పింది.

ఈ ఘటనతో విమానాన్ని పోర్ట్‌లాండ్‌ ఎయిర్ పోర్టుకు మళ్లించి ఎమర్జన్సీ ల్యాండ్ చేసి సదరు ఆఫ్ పైటల్ ను కిందకు దించి అధికారులకు విషయం చెప్పి అప్పగించారు. దీంతో అతనికి అరెస్ట్ చేశారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ విమానంలో 83మంది ఉన్నారు. సకాలంలో స్పందించకపోతే అందరి ప్రాణాల్లో గాల్లో కలిసిపోయేవి.

కాగా నిబంధనల ప్రకారం..డ్యూటీలో లేని పైలట్లు విమానం కాక్‌పిట్‌లోని జంప్ సీటులో కూర్చుని ప్రయాణించవచ్చు. అదికూడా విమానం పైలట్ అనుమతి ఉంటేనే కాక్ పిట్ లో కూర్చునేందుకు వీలు ఉంటుంది.

దీనిపై అలాస్కా ఎయిర్ లైన్స్ అధికారులు మాట్లాడుతు..సకాలంలో స్పందించి పెను ప్రమాదం జరగకుండా అప్రమత్తమైన పైలట్ , కోపైలట్ ను అభినందిస్తున్నామని తెలిపారు. అనూహ్యంగా జరిగే ఘటనపై వృత్తిపరంగా స్పందించటం చాలా గొప్ప విషయం అని దానికి సదరు సిబ్బందికి కృతజ్ఞులం అని వెల్లడించారు.

ట్రెండింగ్ వార్తలు