America : ఇంటి ముందు బోర్డు పెట్టి పిల్లల్ని అమ్మకానికి పెట్టిన తల్లి.. కళ్లు చమర్చే కథ…

భర్తకి ఉద్యోగం లేదు.. ఇంటి అద్దె కట్టే స్థోమత లేదు.. కడుపులో బిడ్డతో కలిపి ఐదుగురు బిడ్డలు.. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఆ తల్లి బిడ్డల్ని అమ్మకానికి పెట్టింది. ఆమె కన్నీటి కథ చదవండి.

America

America : ఇంటర్నెట్‌లో ఎన్నో ఫోటోలు, వీడియోలు వాటి వెనుక ఉండే చరిత్ర తెలుసుకుంటూ ఉంటాం. అందులో కొన్ని విషాద కథనాలు గురించి వింటూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో మనుష్యులు ఎదుర్కున్న కష్టాలు చూసి చలించిపోతాం. అమెరికాకు చెందిన ఓ మహిళ దయనీయమైన కథనాన్ని తెలిపే ఓ ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఆ ఫోటోని చూసి నెటిజన్లు చలించిపోయారు.

Rajendra Prasad : రాజేంద్రప్రసాద్‌ చిన్నప్పటి కన్నీటికథ.. అమ్మ కోసం ఎదురుచూపుతో ప్రాణాలు మీదకు..

1948 లో అమెరికాలోని ఇండియానాలో లూసీల్ అనే మహిళ తన నలుగురు పిల్లల్ని అమ్మకానికి పెట్టింది. లానా (6), ఆమె తమ్ముడు రయాన్ (5), మిల్టన్ (4), సూ (2). భర్తకు ఉద్యోగం లేకపోవడం.. అద్దె కట్టలేని పరిస్థితులు ఉండటంతో ఓనర్ ఆ కుటుంబాన్ని రోడ్డుపైకి నెట్టేసాడు. వీధిన పడ్డ ఆ కుటుంబం తమ బిడ్డలను సాకలేని పరిస్థితుల్లో వారిని 2 డాలర్లకు అమ్మకానికి పెట్టారట.

లూసీల్ తన బిడ్డల్ని అమ్మకానికి పెట్టిన సమయంలో 5వ బిడ్డను కడుపులో మోస్తోంది. ఫోటోగ్రాఫర్ ఫోటో తీయబోతే తన ముఖం కనిపించకుండా చెయ్యి అడ్డు పెట్టుకుంది. ఏ తల్లీ చేయని పని తను చేస్తున్నందుకు ఆమె అవమానంతో ముఖం చాటుకుంది. ఇక ఈ ఫోటో పేపర్లో రావడంతో చూసినవారంతా కన్నీరు పెట్టుకున్నారట. ఆమె బిడ్డల్ని దత్తత తీసుకునేందుకు ముందుకు వచ్చారట. నలుగురి పిల్లలతో పాటు తర్వాత జన్మించిన డేవిడ్‌ను కూడా ఆమె అందరికీ దత్తత ఇచ్చేసిందట.

Boy Dance Viral : కాసేపట్లో ఆపరేషన్.. ‘సెలబ్రేట్’ అంటూ బాలుడు డ్యాన్స్..మనసు కదిలించే వీడియో

దత్తతకు వెళ్లిన పిల్లల్లో రయాన్, మిల్టన్‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారట. బాల్యం మొత్తం కష్టాలు అనుభవించి పెద్దయ్యాక తమ తోబుట్టువులను కలుసుకున్నారట. వాళ్లిద్దరూ లానా, సూ కోసం వెతికితే లానా అప్పటికే చనిపోయినట్లు వారికి తెలిసింది. సూ మాత్రం వారిని కలవగలిగింది. అయితే ఆమె 2013 లో చనిపోయింది. నెట్టింట్లో ఎన్నో చిత్రాలు, విచిత్రాలు, సంతోషాలు, కన్నీళ్లు పంచే కథలు.. వాటి నుండి బయటకు వచ్చిన లూసీల్ కథనం అందరికీ కన్నీరు తెప్పించింది.