South America : అంత్యక్రియలకు శ్మశానానికి తరలిస్తుండగా.. బతికిన వృద్ధురాలు
వృద్ధురాలిని శవపేటికలో శ్మశానవాటికకు తరలిస్తుండగా ఆమె లేచారు. ఈ ఆశ్చర్యకరమైన సంఘటన ఈక్వెడార్ లోని బాబహోయాలో చోటు చేసుకుంది.

Ecuador old woman
Ecuador Old Woman : దక్షిణ అమెరికాలోని ఈక్వెడర్ దేశంలో విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. చనిపోయారనుకున్న వృద్ధురాలు బతికారు. మృతి చెందిన వృద్ధురాలును అంత్యక్రియలకు శ్మశానానికి తరలిస్తుండగా ఆమె బతికారు. వృద్ధురాలిని శవపేటికలో శ్మశానవాటికకు తరలిస్తుండగా ఆమె లేచారు. ఈ ఆశ్చర్యకరమైన సంఘటన ఈక్వెడార్ లోని బాబహోయాలో చోటు చేసుకుంది.
Organ Donation : భారతదేశం అవయవ దానం విషయంలో ఎందుకు వెనుకబడి ఉందంటే ?
ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు షాక్ అయ్యారు. మృతదేహాన్ని శ్మశానానికి తరలిస్తుండగా చేతితో శవపేటికను తట్టిన శబ్ధం వినిపించిందని ఆమె కుమారుడు గిల్ బెర్డో బార్బెలా పేర్కొన్నారు. దీంతో వెంటనే శవపేటిక తెరిచి చూడగా, ఆమె బతికే ఉన్నట్లు తెలిసిందని వెల్లడించారు.