Omicron BA.4.6 Variant : విస్తరిస్తోన్న ఒమిక్రాన్‌ బీఏ.4.6 వేరియంట్‌.. కరోనా మరో వేవ్‌ తప్పదా?

కొత్త వేరియంట్‌ విస్తరిస్తోన్నట్లుగా గుర్తించారు. దీంతో కరోనా మరో వేవ్‌ తప్పదా? అనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అమెరికాలో ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ బీ.ఏ.4.6 ప్రభావం చూపుతుండగా.. యూకేలో కూడా విస్తరిస్తున్నట్లు గుర్తించారు.

Omicron BA.4.6 variant (1)

Omicron BA.4.6 variant : కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతోంది. పాజిటివ్ కేసులు తగ్గుతుండటంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. కొత్త వేరియంట్‌ వస్తే తప్ప.. ఇప్పటికీ ఎలాంటి ముప్పు లేదని నిపుణులు పేర్కొన్న విషయం తెలిసిందే. తాజాగా కొత్త వేరియంట్‌ విస్తరిస్తోన్నట్లుగా గుర్తించారు. దీంతో కరోనా మరో వేవ్‌ తప్పదా? అనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అమెరికాలో ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ బీ.ఏ.4.6 ప్రభావం చూపుతుండగా.. యూకేలో కూడా విస్తరిస్తున్నట్లు గుర్తించారు.

యూకే హెల్త్‌ సెక్యూరిటీ ఏజెన్సీ తెలిపిన వివరాల ప్రకారం.. ఆగస్టు 14 నుంచి వారంలో బీ.ఏ.4.6 వేరియంట్‌ యూకేలోని నమూనాల్లో కనీసం 3.3శాతం గుర్తించారు. ఆ తర్వాత 9శాతానికి చేరింది. అమెరికాలో సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ ప్రకారం.. 9శాతం కేసులకు కొత్త వేరియంట్‌ కారణమని గుర్తించారు. ఆయా దేశాలతో పాటు మరికొన్ని దేశాల్లోనూ ఈ వేరియంట్‌ కేసులు నమోదవుతున్నాయి. ఈ వేరియంట్‌ ఒమిక్రాన్‌ బీఏ.4 సబ్‌వేరియంట్‌కు చెందింది.

Covid cases in india: దేశంలో కొత్తగా 6,422 కరోనా కేసులు నమోదు

శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం.. బీఏ.4.6 ఒమిక్రాన్‌ బీఏ.4 వేరియంట్‌కు చెందిన సబ్‌ వేరియంట్‌. దీన్ని ఈ ఏడాది ప్రారంభంలో దక్షిణాఫ్రికాలో గుర్తించారు. ఆ తర్వాత బీఏ.5 వేరియంట్‌తో పాటు బీఏ.4.6 వేరియంట్‌ ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. అయితే, ఇది రీకాంబినెంట్‌ వేరియంట్‌ అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. రెండు రకాల సార్స్‌-కోవ్‌-2 ఒకే వ్యక్తికి.. ఒకే సమయంలో సోకుతుంది.

అయితే, గతంలో గుర్తించిన వేరియంట్ల కంటే. ఈ వేరియంట్‌ ఎక్కువ ఇన్ఫెక్షన్‌ కలిగిస్తుందా? లేదా? అన్నది స్పష్టంగా తెలియనప్పటికీ.. ఇతర ఒమిక్రాన్‌ వేరియంట్ల మాదిరిగానే ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు. అయితే, వ్యాక్సిన్ తీసుకున్నా తప్పించుకునే ప్రమాదం ఉందని అధ్యయనంలో గుర్తించారు. బూస్టర్‌ డోసులు తీసుకుంటున్నందున బీఏ.4.6కు వ్యతిరేకంగా వ్యాక్సిన్లు ప్రభావవంతంగానే ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

Person Dies From Corona Every 44 Seconds : ప్రపంచవ్యాప్తంగా కరోనాతో ప్రతి 44 సెకన్లకు ఒకరు మృతి : డబ్ల్యుహెచ్ఓ

ఒమిక్రాన్‌ వేరియంట్లతో వేగంగా ఇన్ఫెక్షన్‌ పెరుగుతున్నా.. స్వల్ప అనారోగ్యం ఉంటుందని, తక్కుగానే మరణాలకు కారణమవుతున్నాయని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. కేసులు తగ్గుముఖం పడుతున్నా అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల హెచ్చరించింది. అందరూ తప్పనిసరిగా కొవిడ్‌ నిబంధనలు పాటించాలని సూచించింది.