Omicron : అమెరికాలో ఒమిక్రాన్ పంజా.. 73శాతం కేసులతో డెల్టాను దాటేసింది!

అమెరికాలో ఒమిక్రాన్ వేరియంట్ పంజా విసురుతోంది. రోజురోజుకీ ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పటికే వైరస్ ప్రబలంగా ఉన్న డెల్టా వైరస్‌పై ఒమిక్రాన్‌దే ఆధిపత్యంగా కనిపిస్తోంది.

Omicron dominant US strain : అమెరికాలో ఒమిక్రాన్ వేరియంట్ పంజా విసురుతోంది. రోజురోజుకీ ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పటికే వైరస్ ప్రబలంగా ఉన్న కొవిడ్ డెల్టా వైరస్‌పై ఒమిక్రాన్ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. డెల్టా కొవిడ్ కేసుల కంటే ఒమిక్రాన్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతున్నాయి. తాజా గణాంకాల ప్రకారం.. యుఎస్‌లో సీక్వెన్స్ అయిన కోవిడ్-19 కేసులలో ఒమిక్రాన్ వేరియంట్ 73శాతం వాటాను కలిగి ఉంది. గత వారం నుంచి 3శాతంగా కేసులు పెరిగాయి. దేశవ్యాప్తంగా అత్యంత స్థాయిలో కరోనావైరస్ మ్యుటేట్ అవుతోందని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (Centers for Disease Control and Prevention) తెలిపింది.

అమెరికాలో ప్రబలిన డెల్టా వేరియంట్.. ఇప్పుడు వరుసగా 27శాతం కేసులకు తగ్గింది. డెల్టా కేసులను అధిగమించింది. అమెరికాలో నమోదయ్యే అత్యధిక కేసుల్లో ఒమిక్రాన్ కేసులే ఎక్కువగా ఉంటున్నాయని CDC పేర్కొంది. ఒమిక్రాన్ కేసులు గణనీయమైన పెరగడం పట్ల అమెరికా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. డెల్టా కంటే ఒమిక్రాన్ ఇన్ఫెక్షన్ల తీవ్రత అధికంగా ఉంటుందని నివేదికలు హెచ్చరిస్తున్నాయి. ఒమిక్రాన్ బారినపడి ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య భారీగా పెరిగిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న ఒమిక్రాన్ దాదాపు అన్ని కొత్త ఇన్ఫెక్షన్లకు కారణమవుతుందని గుర్తించారు.

న్యూయార్క్ న్యూజెర్సీలలో 92శాతం కేసుల్లో ఒమిక్రాన్ వేరియంట్ ఉన్నట్టు CDC అంచనా వేసింది. వాషింగ్టన్‌లో 96శాతంగా ఒమిక్రాన్ కేసులు నమోదైనట్టు తెలిపింది. టీకాలకు అర్హత ఉన్నవారికి ఒమిక్రాన్‌ బూస్టర్ అందించాలని అమెరికా భావిస్తోంది. తమ టీకా మూడో డోసుతో ఒమిక్రాన్ వేరియంట్‌పై యాంటీబాడీల స్థాయిలు పెరిగాయని Moderna Inc ఒక ప్రకటనలో వెల్లడించింది.

అలాగే Pfizer Inc. BioNTech SE కంపెనీలు కూడా మూడవ డోస్ ఒమిక్రాన్‌ను న్యుట్రలైజ్ చేయగలవని ల్యాబ్ అధ్యయనాలు చెబుతున్నాయని ఫార్మా కంపెనీలు పేర్కొన్నాయి. ఒమిక్రాన్ వైరస్ నివారించాలంటే ప్రతిఒక్కరూ ఇంట్లో ఉన్నా మాస్క్ ధరించాలని సూచిస్తున్నారు. ఏమైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే టెస్టు చేయించుకోవాలి. వైరస్ లక్షణాలు కలిగిన వారికి దూరంగా ఉండటం వంటి నివారణ చర్యల ద్వారా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చునని CDC పేర్కొంది.

Read Also : Divorce Settlement : రూ.5,500 కోట్ల భరణం.. ప్రపంచంలోనే అతిపెద్ద విడాకుల సెటిల్‌మెంట్ ఇదే..!

ట్రెండింగ్ వార్తలు