పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ లో మంగళవారం (ఫిబ్రవరి-24,2019) ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ పై విపక్షాలు విరుచుకుపడ్డాయి. బాల్ కోట్ ప్రాంతంతో ఉగ్రశిబిరాలపై భారత వాయిసేన దాడుల గురించి మంత్రులు ప్రస్తావిస్తున్న సమయంలో విపక్ష పార్టీల సభ్యులు ఇమ్రాన్ ఖాన్ షేమ్..షేమ్, పీటీఐ షేమ్ షేమ్ అంటూ నినాదాలు చేశారు.దీంతో అధికార,ప్రతిపక్ష పార్టీల మధ్య వాదనలు జరిగాయి. ఒకరినొకరు తిట్టిపోసుకున్నారు. ఇమ్రాన్ పని తీరుని విపక్ష సభ్యులు ఎగతాళి చేశారు. భారత్ కి వ్యతిరేకంగా అందరూ ఒకతాటిపై నిలబడాలని పాక్ మాజీ రక్షణ మంత్రి కవాజా అసిఫ్ అన్ని పార్టీలను కోరాడు. పాక్ ఇప్పుడు డేంజర్ లో ఉందని అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ..సరైన సమయం చూసుకుని భారత్ కు బదులిస్తామని ప్రకటించారు. పాక్ తీసుకోబోయే అన్ని చర్యలకు దేశ ప్రజలు,సైన్యం సిద్ధంగా ఉండాలని ఇమ్రాన్ అన్నారు.