అంగారకుడిపై జీవం ఉందా ?  

  • Publish Date - March 27, 2019 / 02:39 AM IST

అంగారకుడిపై జీవం ఉందా ? జీవం ఉండటానికి అనువైన ప్రాంతం కాదని కొందరు వాదిస్తుంటారు. అంగారకుడి లోపలి పొరల్లో జీవం ఉందా ? అనే ఈ ప్రశ్నకు సమాధానం కనుక్కొన్నామని పరిశోధకులు అంటున్నారు. జీవం ఉండడమే కాదు..ఇప్పుడు అక్కడ శిలీంధ్రాలు పెరుగుతున్నాయని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. ఇవి పుట్టగొడుగుల్లా ఉన్నాయని, క్యూరియాసిటీ రోవర్ పంపిన చిత్రాల ఆధారంగా ఈ అంచనాకు వచ్చినట్లు జర్నల్ ఆఫ్ ఆస్ట్రో బయాలజీ అండ్ స్పేస్ సైన్స్‌లో పరిశోధన వ్యాసం ద్వారా వెల్లడైంది. క్యూరియాసిటీ పంపిన 15 చిత్రాల్లో అత్యంత సాధారణ స్థాయి జీవం తాలుకు ఆనవాళ్లు కనిపిస్తున్నాయని శాస్త్రవేత్త డాక్టర్ రెజీనా డాస్ చెప్పారు.
Read Also : మాస్టర్ పీస్ : 1300 హిస్టరీ ఈ హోటల్ సొంతం

అంగారకుడి వాతావరణంలో ఉన్న మీథేన్ వాయువు ఒక క్రమపద్ధతిలో హెచ్చుతగ్గులకు లోనవుతోందని అంచనా వేస్తున్నారు. అక్కడి జీవం బతికి ఉన్నప్పుడు ఒకలా..చనిపోయినప్పుడు మరోలా మీథేన్ స్థాయిలు మారుతున్నాయన్నమాట. క్యూరియాసిటీ పంపిన చిత్రాలు మూడు రోజులకు సంబంధించినవైతే..మొదటి రోజు చిత్రంలోని నాచుకంటే మూడో రోజు ఎక్కువగా ఉన్నట్లు నిర్ధారించారు. 

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) రెస్పాండ్ అవ్వలేదు. ఉల్కా శకలాలు ఢీకొట్టినందున ఒకప్పుడు అంగారుకుడిపై జీవం ఉండేందుకు అవసరమైన అన్ని అనుకూల పరిస్థితులు ఉండే అవకాశం ఉందని నాసా ఒక ప్రకటనలో వెల్లడించింది. గ్రహం ఏర్పడిన తొలినాళ్లలో  అక్కడి వాతావరణంపై హైడ్రోజన్ ఎక్కువగా ఉండి ఉంటే..గ్రహశకలాలు ఢీకొట్టడం వల్ల జీవం ఏర్పడేందుకు అత్యంత కీలకమైన నైట్రోజన్ రూపాలు నైట్రేటు్ల (SO2) నైట్రేట్లు (SO3)లు ఏర్పడుతాయని, క్యూరియాసిటీ రోవర్ వీటిని గేల్ క్రేటర్ ప్రాంతంలో సేకరించిన మట్టి, రాతి నమూనాల్లో గుర్తించిందని పేర్కొంది. అంగారుకుడిపై హైడ్రోజన్ ఎక్కువగా ఉండి ఉంటే జీవం మనుగడకు అవసరమైన పరిస్థితులు ఉండేవని నిర్ధారణకు వచ్చారు. 
Read Also : డెడ్‌లైన్.. 4 రోజులే : పాన్ కార్డుతో ఆధార్ లింక్ చేశారా?