ఆస్కార్ అవార్డు ధర 72రూపాయలే

  • Published By: vamsi ,Published On : February 9, 2020 / 09:35 AM IST
ఆస్కార్ అవార్డు ధర 72రూపాయలే

Updated On : February 9, 2020 / 9:35 AM IST

2019 సంవత్సరానికిగాను ఆస్కార్ అవార్డులను అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్‌‌ట్స అండ్ సెన్సైస్ (Academy of Motion Picture Arts and Sciences-AMPAS) ఫిబ్రవరి 9వ తేదీన ప్రదానం చేయనుంది. అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లోని డాల్బి థియేటర్‌లో 92వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో విజేతలు బహుమతులు అందుకోబోతున్నారు.

ఈ ప్రతిష్టాత్మక పురస్కారాల్లో ఉత్తమ చిత్రాలకు, ఉత్తమ నటులకు, ఉత్తమ నటీమణులకు అవార్డులు దక్కనున్నాయి. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే నిర్వాహకులు పూర్తి చేశారు. దశాబ్దాలుగా ఆనవాయితీగా సాగిస్తున్న ఈ అవార్డులను కొనసాగిస్తుండగా.. ఏర్పాట్లలో ఓ బంగారు పూత విగ్రహం ఆస్కార్‌ను పోలినట్లుగా ఎంట్రన్స్‌లో ఉండేది ఆసక్తికరంగా కనిపిస్తుంది.

ఆస్కార్ అవార్డును పోలినట్లుగానే కత్తిని పట్టుకుని బంగారు పూతతో ఉన్న విగ్రహం 13 అంగుళాల పొడవుతో 4 కిలోల బరువు ఉంటుంది. ఈ బొమ్మ ఫిల్మ్ రీల్ పైన ఐదు చువ్వలు ఉంటాయి. ఇది సినిమా రంగంలోని ఐదు శాఖలను సూచిస్తుంది. అవి నటులు, దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు మరియు రచయితలు. అకాడమీ అవార్డులు ప్రారంభమైనప్పటి నుండి 3 వేలకు పైగా విగ్రహాలు ఇప్పటివరకు అర్హులకు దక్కాయి.

అసలు ఆస్కార్ అవార్డు ఖరీదు ఎంతంటే..  కాంస్యంతో తయారు చేసి, 24-క్యారెట్ల బంగారంతో పూసిన, ఆస్కార్ విగ్రహం అసలు ధర 400డాలర్లు అంటే మన కరెన్సీలో దాదాపు 30వేల రూపాయల వరకు ఉంటుంది.  స్టీవెన్ స్పీల్బర్గ్.. బెట్టే డేవిస్ కి 1938లో వచ్చిన ఉత్తమ నటి ఆస్కార్‌ను 578,000డాలర్లకు కొన్నారు. క్లార్క్ గేబుల్ ఉత్తమ నటుడి అవార్డును కూడా 607,500 డాలర్లకు  కొన్నాడు. అయితే వాటిని అకాడమీకి తిరిగి ఇచ్చేశాడు.

అకాడమీ నిబంధనల ప్రకారం, 2015 కోర్టు తీర్పును అనుసరించి, అవార్డు గ్రహీతలు ఆస్కార్ విగ్రహాన్ని అమ్మకుండా నిబంధనలు తీసుకుని వచ్చారు. అలాగే దానిని పారవేయడానికి కూడా వీలు లేదు. ఒక వేళ అకాడమీకే తిరిగి ఇవ్వాలని అనుకుంటే అకాడమి ఒక్క డాలర్ అంటే మన కరెన్సీలో దాదాపు 72రూపాయలు తిరిగి ఇస్తుంది.