Morocco Earthquake
Morocco Earthquake : మొరాకోలో సంభవించిన భారీ భూకంపంలో 2,000 మందికి పైగా మృతి చెందారు. 2,059 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరుగుతోంది. శుక్రవారం సెంట్రల్ మొరాకోలో మరాకేష్‌కు నైరుతి దిశలో 72 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.8గా నమోదు అయింది. ఆరు దశాబ్దాల తర్వాత దేశంలో సంభవించిన అత్యంత ఘోరమైన భూకంపం ఇది. ప్రపంచం నలుమూలల నుండి మొరాకోకు సహాయం సహకారాలు వెల్లువెత్తుతున్నాయి.
సహాయం అందించడానికి ప్రపంప దేశాలు ముందుకు వచ్చాయి. మారుమూల పర్వత గ్రామాలలో ప్రాణాలతో బయటపడిన వారి కోసం రెస్క్యూ టీమ్స్ శిథిలాలను తొలగిస్తున్నారు. రెండు సంవత్సరాల క్రితం మొరాకోతో సంబంధాలను తెంచుకున్న పొరుగు దేశం అల్జీరియాతో సహా అన్ని వైపుల నుండి సహాయం అందిస్తున్నారు. అల్జీరియా, మొరాకో మధ్య దశాబ్దాలుగా వైరం కొనసాగుతోంది.
Earthquake : టిబెట్ లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 4.0గా నమోదు
అయినప్పటికీ అల్జీరియా పొరుగున ఉన్న మొరాకోకు మానవతా దృక్పథంలో సహాయం అందించింది. భారీ భూకంపం సంభవించిన దేశానికి మానవతా సహాయం లేదా వైద్యులు, మెడిసిన్స్ తరలింపు కోసం విమానాలు ప్రయాణించడానికి బయటికి వెళ్లడానికి అల్జీరియా తన గగనతలాన్ని తెరవడానికి ముందుకొచ్చింది. అల్జీరియా, మొరాకో మధ్య సరిహద్దు 1994 నుండి మూసి వేశారు. అలాగే 2021 నుండి గగనతలం మూసివేశారు.
మొరాకో దేశ అధికారులు కోరితే సోదర మొరాకో ప్రజలకు సంఘీభావంగా మానవతా సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నామని అల్జీరియా అధ్యక్షుడు అబ్దెల్‌మాడ్‌జిద్ టెబౌన్ కార్యాలయం శనివారం ఒక ప్రకటనను విడుదల చేసింది. మొరాకోలోని అమెరికన్ పౌరులు సురక్షితంగా ఉన్నారని నిర్ధారించడానికి అమెరికా అధికారులు ఆ దేశంతో సంప్రదింపులు జరుపుతున్నారని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ తెలిపారు.
Earthquake : జపాన్,కాలిఫోర్నియా, అండమాన్ నికోబార్ దీవులు భూకంపం
మొరాకో ప్రజలకు అవసరమైన సహాయం అందించడానికి యుఎస్ సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా మొరాకోలో జరిగిన ప్రాణ నష్టంపై తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ కష్ట సమయంలో మొరాకోకు అన్ని విధాలా సహాయాన్ని అందించడానికి భారతదేశం సిద్ధంగా ఉందని అన్నారు. మొరాకోకు సహాయం అందించిన ఇతర దేశాల్లో టర్కీ, ఖతార్, ఫ్రాన్స్, జర్మనీ, ఇజ్రాయెల్, ఖతార్, దుబాయ్ మరియు జోర్డాన్ ఉన్నాయి.
ఫ్రాన్స్‌లో ఆరెంజ్ అనే మొబైల్ ఆపరేటర్ భారీ భూకంపం తర్వాత మొరాకోకు ఒక వారం పాటు ఉచిత కాల్‌లను అందిస్తోంది. కాగా, ఈ ఏడాది ప్రారంభంలో టర్కీలో సంభవించిన భారీ భూకంపంలో వేలాది మంది చనిపోయారు. ప్రాణాలతో బయటపడిన వారికి వైద్య సహాయం అందించడానికి సహాయం చేయడానికి వైద్యులు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
Earthquake : కొలంబియన్ రాజధానిలో భారీ భూకంపం
ఈ దశలో ఆరోగ్య సేవలను పునరుద్ధరించడం, అవసరమైన సామాగ్రిని అందించడం కూడా ప్రాధాన్యతనిస్తుంది. భారీ భూకంపం కారణంగా అధికారులు మూడు రోజుల జాతీయ సంతాప దినాలు ప్రకటించారు. అయితే ఈ నష్టాన్ని సరిచేయడానికి ఏళ్ల సమయం పట్టవచ్చని రెడ్‌క్రాస్ హెచ్చరించింది.