Pak army chief Bajwa: పదవీ విరమణ వేళ పాక్ ఆర్మీ చీఫ్ బజ్వాకు చిక్కులు.. ఆరేళ్లలో ఆయన కుటుంబం పోగేసిన ఆస్తులపై సంచలన విషయాలు

పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావెద్ బజ్వా ఈ నెల 29న పదవీ విరమణ చేయాల్సి వేళ ఆయన సంపద గురించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఒకవైపు పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుంటే మరోవైపు గత ఆరేళ్లలో బజ్వా కుటుంబ సభ్యులకు సంబంధించిన సంపద విపరీతంగా పెరిగిందని ఓ నివేదిక ద్వారా తెలిసింది. బజ్వా కుటుంబ సభ్యుల సంపద ఒక్కసారిగా ఎలా పెరిగిందన్న విషయాలను "ఫ్యాక్ట్ ఫోకస్" వెబ్ సైట్ కు సమర్పించిన నివేదిక ద్వారా పాకిస్థాన్ జర్నలిస్టు అహ్మద్ నూరానీ బయటపెట్టారు.

Pak army chief Bajwa: పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావెద్ బజ్వా ఈ నెల 29న పదవీ విరమణ చేయాల్సి వేళ ఆయన సంపద గురించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఒకవైపు పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుంటే మరోవైపు గత ఆరేళ్లలో బజ్వా కుటుంబ సభ్యులకు సంబంధించిన సంపద విపరీతంగా పెరిగిందని ఓ నివేదిక ద్వారా తెలిసింది. బజ్వా కుటుంబ సభ్యుల సంపద ఒక్కసారిగా ఎలా పెరిగిందన్న విషయాలను “ఫ్యాక్ట్ ఫోకస్” వెబ్ సైట్ కు సమర్పించిన నివేదిక ద్వారా పాకిస్థాన్ జర్నలిస్టు అహ్మద్ నూరానీ బయటపెట్టారు.

బజ్వా కుటుంబ సభ్యులు కొత్తగా వ్యాపారాలు ప్రారంభించారని, పాకిస్థాన్ లోని కీలక నగరాల్లో ఫాంహౌసుల యజమానులు అయ్యారని, విదేశాల్లో ఆస్తులు కొన్నారని చెప్పారు. బజ్వా భార్య అయేజా అంజాద్, కోడలు మహ్నూర్ సాబిర్, ఇతర కుటుంబ సభ్యులకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల డేటాను విశ్లేషించి ఆయా విషయాలను ఆ జర్నలిస్టు బయటపెట్టారు.

‘‘కేవలం ఆరేళ్లలో ఆయన కుటుంబ సభ్యులు కోటీశ్వరులు అయ్యారు. అంతర్జాతీయ వ్యాపారాలు ప్రారంభించారు. విదేశాలు అనేక రకాల ఆస్తులు కొన్నారు. కమర్షియల్ ప్లాజాలకు యజమానులు అయ్యారు. కమర్షియల్ ప్లాట్లు కొన్నారు. ఇస్లామాబాద్, కరాచీ, లాహోర్ తో పాటు పలు నగరాల్లో ఫాంహౌసులు కొనుగులు చేశారు.

కేవలం ఆరేళ్లలో బజ్వా కుటుంబం సంపాదించిన ఆస్తుల విలువ పాకిస్థాన్ రూపాయల్లో 1,270 కోట్లుగా ఉంది’’ అని తన నివేదికలో జర్నలిస్టు అహ్మద్ నూరానీ వెల్లడించారు. బజ్వాకు పాక్ ప్రభుత్వ మద్దతు ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన కుటుంబం ఆస్తులు పోగేసిన విషయాన్ని ఫ్యాక్ట ఫోకస్ వెబ్ సైట్ ప్రచురించిన వెంటనే పాక్ లో దాన్ని బ్లాక్ చేశారు. ఈ విషయాన్ని తెలుపుతూ ఆ సంస్థ తమ ట్విట్టర్ ఖాతాలో పూర్తి వివరాలు పోస్ట్ చేసింది.

ట్రెండింగ్ వార్తలు