Mushaal Hussein Mullick: పాక్ ఆపద్ధర్మ ప్రభుత్వంలో ఉగ్రవాది యాసిన్ మాలిక్ భార్యకు మంత్రి పదవి

సాక్షాత్తూ ఓ ఉగ్రవాది భార్యకు పాక్ ఆపద్ధర్మ ప్రభుత్వంలో మంత్రి పదవి ఇవ్వడం సంచలనం రేపింది. పాకిస్థాన్‌ తాత్కాలిక ప్రధాని అన్వర్‌ ఉల్‌ హక్‌ కకర్‌ తన మంత్రివర్గంలో భారత జైలులో ఉన్న ఉగ్రవాది, జమ్మూ కశ్మీర్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ (జేకేఎల్‌ఎఫ్‌) చీఫ్‌ యాసిన్‌ మాలిక్‌ భార్య మిషాల్‌ హుస్సేన్‌ మాలిక్‌ను చేర్చుకున్నారు....

Terrorist Yasin Malik's Wife

Mushaal Hussein Mullick – Yasin Malik Wife : సాక్షాత్తూ ఓ ఉగ్రవాది భార్యకు పాక్ ఆపద్ధర్మ ప్రభుత్వంలో మంత్రి పదవి ఇవ్వడం సంచలనం రేపింది. పాకిస్థాన్‌ తాత్కాలిక ప్రధాని అన్వర్‌ ఉల్‌ హక్‌ కకర్‌ తన మంత్రివర్గంలో భారత జైలులో ఉన్న ఉగ్రవాది, జమ్మూ కశ్మీర్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ (జేకేఎల్‌ఎఫ్‌) చీఫ్‌ యాసిన్‌ మాలిక్‌ భార్య మిషాల్‌ హుస్సేన్‌ మాలిక్‌ను చేర్చుకున్నారు. (Yasin Malik’s Wife In Cabinet) కాశ్మీరీ వేర్పాటువాది అయిన యాసిన్ మాలిక్‌ తీవ్రవాద నిధుల కేసుల్లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) కోర్టు దోషిగా నిర్ధారించింది.

Earthquake : కొలంబియన్ రాజధానిలో భారీ భూకంపం

దీంతో కోర్టు యాసీన్ కు 2022 వ సంవత్సరం మే 25వతేదీన జీవిత ఖైదు విధించింది. యాసీన్ భార్య అయిన మిషాల్ హుస్సేన్ మాలిక్ పాకిస్థాన్ మానవ హక్కుల మంత్రిగా నియమించడాన్ని బట్టి ఆ దేశం ఉగ్రవాదానికి ఊతం ఇస్తున్నట్లు భావించవచ్చు. (Pak Caretaker PM Includes Yasin Malik Wife) కొత్తగా నియమితుడైన తాత్కాలిక ప్రధానమంత్రి అన్వర్-ఉల్-హక్ కాకర్ కేబినెట్ సభ్యులతో పాకిస్థాన్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ గురువారం ప్రమాణం చేయించారు.

Plane Crash : ఓ మై గాడ్.. ఘోర ప్రమాదం, రోడ్డుపై కుప్పకూలిన విమానం, 10మంది దుర్మరణం.. ఒళ్లుగగుర్పొడిచే వీడియో

పదహారు మంది సమాఖ్య మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. పాకిస్థన్ తాత్కాలిక ప్రధాని ముగ్గురు సలహాదారులను కూడా నియమించుకున్నారు. మంత్రులుగా జలీల్ అబ్బాస్ జిలానీ, లెఫ్టినెంట్ జనరల్ (ఆర్) అన్వర్ అలీ హైదర్, ముర్తజా సోలంగి సమీ సయీద్, షాహిద్ అష్రఫ్ తరార్, అహ్మద్ ఇర్ఫాన్ అస్లాం, ముహమ్మద్ అలీ, గోహర్ ఎజాజ్, ఉమర్ సైఫ్, నదీమ్ జాన్, ఖలీల్ జార్జ్, అనీఖ్ అహ్మద్, జమాల్ షా, మదాద్ అలీ సింధీ ప్రమాణ స్వీకారం చేశారు.

Apple Warn : ఐఫోన్ యూజర్లకు ఆపిల్ వార్నింగ్.. పక్కనే ఫోన్ ఛార్జింగ్ పెట్టి నిద్రపోతున్నారా? తస్మాత్ జాగ్రత్త..!

పాకిస్థాన్ కేర్‌టేకర్ పీఎం సలహాదారులుగా ఎయిర్ మార్షల్ (ఆర్) ఫర్హత్ హుస్సేన్ ఖాన్,అహద్ ఖాన్ చీమా, వకార్ మసూద్ ఖాన్ లను నియమించారు. జేకేఎల్ఎఫ్ ను 2019వ సంవత్సరంలో నిషేధించారు. యాసీన్ మాలిక్ 2009లో ముషాల్ హుస్సేన్ ముల్లిక్‌ను వివాహం చేసుకున్నాడు. నాటి వివాహ వేడుకలకు పాకిస్థాన్‌లోని కొంతమంది రాజకీయ నాయకులు హాజరయ్యారు.

ట్రెండింగ్ వార్తలు