Pak PM Sharif
Pak PM Sharif : భారత్‌తో కాల్పుల విరమణకు దోహదపడినందుకు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అమెరికాకు కృతజ్ఞతలు తెలిపారు. ఇరుదేశాల మధ్య శాంతిని నెలకొల్పినందుకు ఆయన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ప్రశంసించారు.
సోషల్ మీడియా వేదికగా పాక్ పీఎం స్పందిస్తూ.. ఈ ప్రాంతంలోని సమస్యల పరిష్కారానికి కొత్త ఆరంభం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Read Also : IPL 2025 : గుడ్ న్యూస్.. ఐపీఎల్ రీస్టార్ట్.. కొత్త షెడ్యూల్ ఎప్పుడంటే? ఫుల్ డిటెయిల్స్!
“ఇరుదేశాల మధ్య శాంతి కోసం ట్రంప్ నాయకత్వం, చురుకైన పాత్ర పోషించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం.
యుద్ధ వాతావరణాన్ని సులభతరం చేసినందుకు పాకిస్తాన్ అమెరికాను అభినందిస్తుంది. ప్రాంతీయ శాంతి, స్థిరత్వం కోసం మేం అంగీకరించాము” అని ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్‌లో పేర్కొన్నారు.
దక్షిణాసియాలో శాంతికి విలువైన కృషి చేసినందుకు అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్, విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోలకు కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
అంతకుముందు, షెహబాజ్ సోదరుడు, మాజీ పీఎం నవాజ్ షరీఫ్ మాట్లాడుతూ.. పాకిస్తాన్ శాంతిని ప్రేమించే దేశమని, కానీ తమను తాము ఎలా రక్షించుకోవాలో కూడా తెలుసు” అని అన్నారు.
భారత్, పాకిస్తాన్ పూర్తి కాల్పుల విరమణకు అంగీకరించాయని ట్రంప్ ప్రకటించిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అధికార పాకిస్తాన్ ముస్లిం లీగ్ (నవాజ్) పార్టీ అధినేత షరీఫ్ కూడా పౌర, సైనిక నాయకత్వాన్ని అభినందించారు.
పాకిస్తాన్ శాంతికి చర్చలు, దౌత్యాన్ని అనుసరిస్తోందని యుద్ధం, హింస, దురాక్రమణ ఎప్పుడూ సమాధానం కాదని మాజీ విదేశాంగ మంత్రి, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చీఫ్ బిలావల్ భుట్టో జర్దారీ అన్నారు.
Read Also : Nagrota Army Station : జమ్మూలో హై అలర్ట్.. నగ్రోటాలో ఆర్మీ యూనిట్‌పై కాల్పులు.. భారత జవాన్‌కు గాయాలు..!
భారత్, పాకిస్తాన్ రెండూ కాల్పుల విరమణ, చర్చలకు అంగీకరించాయి. దౌత్య విజయంగా మేం స్వాగతిస్తున్నామని, ఈ చారిత్రాత్మక మైలురాయిని సాధించడంలో అమెరికా, KSA సహా అన్ని దేశాల పాత్రను అభినందిస్తున్నామని ఆయన ఎక్స్ వేదికగా తెలిపారు.