Pakistan: దమ్ముంటే ఆ సింగర్‌ని విమర్శించండి చూద్దాం.. నెటిజెన్లకు ఛాలెంజ్ విసిరిన పాక్ సింగర్

Ali Zafar Video: భారత్, పాకిస్తాన్ దేశాల్లో జరిగే వివాహాలు, ఇతర కార్యక్రమాలలో జానపద గాయకులు ప్రదర్శన ఇవ్వడం సర్వసాధారణం. వీటికి సాంస్కృతికపరమైన మూలాలు ఉన్నాయి. అయితే, పాకిస్థానీ గాయకుడు అలీ జాఫర్ సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలో ఒక జానపద గాయకుడు ఎవరూ ఊహించలేని విభిన్నమైన వాయిద్యంతో ప్రదర్శన ఇచ్చారు. ఆ వీడియోను అలీ షేర్ చేస్తూ ‘దమ్ముంటే ఈయనను ట్యాగ్ చేసి, విమర్శ చేయండి’ అని ట్వీట్ చేశారు. ఎందుకంటే.. ఆ గాయకుడు ప్రదర్శన చేస్తున్నది తుపాకీతో.
Karnataka: ఆర్‌ఎస్‌ఎస్‌కు షాకిచ్చిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య.. బొమ్మై హామీ వెనక్కే
30-సెకన్ల క్లిప్‌లో మనిషి చిన్న ఫంక్షన్‌లో పాట పాడుతున్నాడు. అదే సమయంలో తుపాకీతో గాలిలోకి కాల్పులు జరుపుతున్నాడు. తుపాకీ నిజమైన తుపాకీనా లేక క్రాకర్స్ కాల్చే తుపాకీనా అనేది స్పష్టంగా తెలియలేదు. కానీ, పలు రౌండ్లు కాల్చడం, దానిని ఒకసారి లోడ్ చేయడం వీడియోలో చూడొచ్చు. సదరు గాయకుడు పాకిస్తాన్‌కు చెందినవాడని తెలుస్తోంది. ఇక ఈ వీడియోకు కామెంట్లు కూడా అలాగే వస్తున్నాయి. “ఎవరైనా మరణాన్ని ఆహ్వానించాలనుకుంటే, ఆయన గానం పట్ల అభ్యంతరం చెప్పండి” అని ఒక ట్విట్టర్ వినియోగదారు వ్యాఖ్యానించాడు. “అతను ఉత్తమ గాయకుడు” మరొకవ్యక్తి కామెంట్ చేశాడు.
Dare you to tag him and criticise his singing. pic.twitter.com/eJ9cHJNwgC
— Ali Zafar (@AliZafarsays) July 14, 2023
‘‘ వివాహ వేడుకకు అతడిని అస్సలు పిలవను’’ అని మరొక వినియోగదారు రాశారు. “మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఎంపికలో అతడికి ప్రత్యేకమైన శైలి ఉంది” అని మరొక నెటిజన్ అన్నారు. “ఈ కచేరికి హాజరు కావాలంటే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు వేసుకోవాలిని” మరొకరు చమత్కరించారు.