Pak Sugar : ఇండియాను కాదనుకుంది..ఇప్పుడు అనుభవిస్తోంది

పాక్ లో చాలా మంది చాయ్ తాగడమే మానేశారంట. దీనికి కారణం ఏంటో తెలుసా ? ఇండియాను వద్దనుకోవడమే.

Pakistan Affects Sugar : పొద్దున లేచి ముఖం కడుక్కోగానే..అందరికీ కావాల్సింది చాయ్. సామాన్యుడి నుంచి మొదలుకుని..ప్రముఖుల వరకు చాయ్ అలవాటు ఉంటుంది. ఇంటి నుంచి బయటకు వచ్చినా..చాయ్ తాగుదామంటూ..హోటల్ లకు వెళుతుంటారు. ఈ చాయ్ ధర రూ. 10 నుంచి దాని వెరైటీలను బట్టి ఉంటుంది. కానీ..ఒక్క కప్పు చాయ్ ధర రూ. 40కి పైనే ఉంటే..వామ్మో…అంటాం కదా. అవును పొరుగున్న ఉన్న పాక్ లో ప్రస్తుతం ఆ పరిస్థితి నెలకొంది. దీంతో చాలా మంది చాయ్ తాగడమే మానేశారంట. దీనికి కారణం ఏంటో తెలుసా ? ఇండియాను వద్దనుకోవడమే. ఆ వస్తువే వద్దని చెప్పింది. ఫలితం..ఇప్పడు ఆ దేశం అనుభవిస్తోంది. ఇండియాలో అత్యంత చవకగా లభించే చక్కెర లభించే అవకాశం ఉన్నా..నో అని చెప్పింది. ఇండియా నుంచి దిగుమతులు అవసరం లేదని చెప్పడంతో అక్కడ నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్రధానంగా ఛాయ్ ధర పైకి ఎగబాగుతోంది.

Read More : Amazon : ప్రొడక్టులను కాపీ చేసి..ప్రమోట్ చేస్తోందా ? రాయిటర్స్ సంచలన కథనం

స్టార్ బౌలర్ షోయబ్ అక్తర్ సొంతూరు రావాల్పిండిలో ఒక్క కప్పు చాయ్ ధర రూ. 40కి చేరింది. చక్కెర, టీ పొడి, గ్యాస్, పాలు అన్ని ధరలు పెరిగిపోవడంతో సామాన్యుడు బెంబేలెత్తుతున్నాడు. పాలు లీటర్ కు రూ. 120కి చేరిందని చాయ్ వాలాలు చెబుతున్నారు. గ్యాస్ సిలిండర్ ధర రూ. 1500 నుంచి రూ. 3000 వేల వరకు చేరడంతో…చాయ్ ధరలు పెంచకతప్పలేదని అంటున్నారు. అంత పెట్టి కొనలేని వారు చాయ్ మానేస్తున్నారంట.

Read More : Distant red stars signals : 19 నక్షత్రాల నుంచి రేడియో సిగ్నల్స్.. గ్రహాంతరవాసులు ఇచ్చిన సంకేతాలా?

కశ్మీర్ ఆర్టికల్ 370ని పునరుద్ధరించేంత వరకు భారతదేశం నుంచి చక్కెర, గోధుమలు వంటి నిత్యావసరాలను దిగుమతి చేసుకోమని పాక్ తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. ఇటీవలే ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ పాకిస్తాన్ 27 వేల 760 టన్నుల చక్కెరను వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకుంది. కిలో చక్కెర రూ. 120 చెల్లించారు. ఇంతకంటే తక్కువ ధరకే ఇండియాలో లభిస్తుంది. కానీ పాక్ దిగుమతి చేసుకోమని చెప్పడంతో…ధరలు పెరిగిపోతున్నాయి.

ట్రెండింగ్ వార్తలు