United Nations: పాకిస్థాన్ సహా ఆహార కొరతతో అల్లాడిపోనున్న దేశాలు ఇవే..

పాకిస్థాన్ కు అప్పులు దొరకడం కూడా గగనంగా మారింది.

United Nations – Food Shortage: ప్రపంచంలోని పలు దేశాల్లో ఆహార కొరత నెలకొనే ప్రమాదం పొంచి ఉంది. ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ (FAO), ప్రపంచ ఆరోగ్య కార్యక్రమం (WFP) ఇందుకు సంబంధించిన వివరాలు తెలిపాయి.

ఆ రెండు సంస్థలు తెలిపిన వివరాల ప్రకారం… ఇప్పటికే ఆర్థిక, ఆహార, రాజకీయ సంక్షోభంలోకి కూరుకుపోతోన్న పాకిస్థాన్ లో మరికొన్ని నెలల్లో ఆహార కొరత మరింత పెరగనుంది. ఆర్థిక, రాజకీయ సంక్షోభం తగ్గకపోతే ఆ పరిస్థితి నెలకొనే ముప్పు ఉంది. పాకిస్థాన్ తో పాటు అఫ్గానిస్థాన్ కు ఆహార కొరతపై ఎఫ్ఏఓ, డబ్ల్యూఎఫ్‌పీ ముందస్తు హెచ్చరిక చేశాయి.

తీవ్ర ఆహార కొరతను ఎదుర్కొనే దేశాల జాబితాలో పాకిస్థాన్, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, ఇథియోపియా, కెన్యా, కాంగో, సిరియన్ అరబ్ రిపబ్లిక్, మయన్మార్ ఉన్నాయి. పరిస్థితులను మెరుగు పర్చుకోకపోతే రానున్న కొన్ని నెలల్లో ప్రజలు ఆకలితో అల్లాడే ప్రమాదం ఉంది. పాకిస్థాన్ కు అప్పులు దొరకడం కూడా గగనంగా మారింది.

రాజకీయ సంక్షోభంతో పాటు, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (IMF) పాక్ కు నిధులు ఇవ్వడంలో జాప్యం చేస్తుండడం ఆ దేశాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టేస్తోంది. వచ్చే ఏడాది అక్టోబరులో పాకిస్థాన్ లో ఎన్నికలు జరగాల్సి ఉంది. దీంతో సంక్షోభం మరింత పెరిగే అవకాశాలే ఉన్నాయి. ఈ ఏడాది సెప్టెంబరు- డిసెంబరు మధ్య పాకిస్థాన్ లోని 85 లక్షల మంది ఆహార కొరతను ఎదుర్కొనే ముప్పు పొంచి ఉంది.

Millionaire Cam Moar : 9-5 గంటలు మనసు చంపుకుని ఉద్యోగం చేయకండి అంటున్న యంగ్ మిలియనీర్

ట్రెండింగ్ వార్తలు