Millionaire Cam Moar : 9-5 గంటలు మనసు చంపుకుని ఉద్యోగం చేయకండి అంటున్న యంగ్ మిలియనీర్

ఉదయం 9 గంటలకు ఉద్యోగం కోసం బయటకు వెళ్తే రాత్రి 9 దాటాకా ఇళ్లకు చేరుకునే పరిస్థితి. ఇన్ని గంటలు పనిచేస్తూ సమయాన్ని వృధా చేసుకోకండి అంటున్నాడు ఆస్ట్రేలియన్ మిలియనీర్. అయితే ఏం చేయమంటాడు? చదవండి.

Millionaire Cam Moar : 9-5 గంటలు మనసు చంపుకుని ఉద్యోగం చేయకండి అంటున్న యంగ్ మిలియనీర్

Millionaire Cam Moar

Viral News : స్కూల్‌కి వెళ్లడం.. డిగ్రీలు పూర్తి చేయడం.. ఇల్లు కొనడం వాటికి ఈఎంఐలు చెల్లించడం ఇదే అందరూ చేసే రొటీన్ పని. ఇందుకు భిన్నంగా ఆలోచించమంటున్నాడు చిన్న వయస్కుడైన మిలియనీర్ కామ్ మోర్. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉద్యోగం చేస్తూ టైం వృధా చేసుకోకండి అని సలహా ఇస్తున్నాడు. అతని కథేంటో చదవండి.

 

మెట్రోపాలిటన్ సిటీల్లో ఎక్కువమంది జనం 9-5 లేదా అంతకంటే ఎక్కువ గంటలు ఉద్యోగాల్లో బిజీగా ఉంటారు. అయితే ఈ పద్ధతిలో ఉద్యోగం సరైనది కాదంటున్నాడు ఆస్ట్రేలియన్ మిలియనీర్ కామ్ మోర్. అతి చిన్న వయసులో మిలియనీర్ల జాబితాలో చోటు దక్కించుకున్న ఇతను తన గురించి న్యూయార్క్ పోస్టు నివేదికలో అనేక విషయాలు షేర్ చేసుకున్నాడు.

22-year-old millionaire : 17 ఏళ్లకు చదువుకు ఆపేశాడు.. 22 ఏళ్లకు మిలియనీర్ అయ్యాడు.. ఓ యువకుడి సక్సెస్‌ఫుల్ స్టోరి

22 ఏళ్ల మోర్ నాలుగు సంవత్సరాలు కార్పెంటరీ అప్రెంటిస్ షిప్‌లో పనిచేయడం మొదలు పెట్టాడు. అక్కడ పని ప్రారంభించినప్పుడు ఎలా ఉంటుందో తెలుసుకున్నాడు. అక్కడ వారానికి ఐదు రోజులు.. రోజూ 12 గంటలు పనిచేసేవాడట. అంత కష్టపడ్డా అతని జీతం కేవలం $600 (రూ.49,442 ఇండియన్ కరెన్సీలో) మాత్రమేనట. చెక్క పనిని ఇష్టపడనప్పటికీ ఇది మార్పులేని ఉద్యోగంగా త్వరలోనే తెలుసుకున్నాడట. ఆరు నెలలు పని చేశాక ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఇ-కామర్స్ వ్యాపారంపై దృష్టి పెట్టాడు. ఆశ్చర్యంగా కేవలం రెండు నెలల్లోనే ఉత్పత్తులను అమ్మిన తర్వాత $69,000 (రూ.56,85,841 ఇండియన్ కరెన్సీలో) సంపాదించాడట.

 

ఇక కామ్ ఆలస్యం చేయకుండా ఇ-కామర్స్ కంపెనీని 2020 లో ప్రారంభించాడట. దానికి ‘6 ఫిగర్ డ్రాప్ షిప్పర్’ అని పేరు కూడా పెట్టాడు. ప్రతి రోజూ అతను 2-3 గంటలు ఇ-కామర్స్ వ్యాపారం గురించి క్లాసులు చెప్పేవాడట. కంపెనీ మొదలైన రెండు సంవత్సరాలకి కామ్ ప్రతి నెల $250,000 (రూ.2,06,00,875 ఇండియన్ కరెన్సీలో) మొత్తాన్ని సంపాదించడం మొదలుపెట్టాడు. ఈ వ్యాపారం కాస్త ప్రమాదకరమైనది అయినా కష్టపడి పనిచేయాల్సి ఉంటుందని అయితే వేరొకరి ఇల్లు నిర్మించే పనికోసం.. ఒకరి ఇంట్లో డ్రైవింగ్ పని కోసం ఉదయం 5 గంటలకు లేచే పని అయితే తనకు లేదని మోర్ చెబుతున్నాడు.

Rickshaw Puller success story: రిక్షావాలా ఇప్పుడు మిలియనీర్.. IIT, IIM గ్రాడ్యుయేట్స్ కి ఉద్యోగాలిస్తున్నాడు..

ప్రస్తుతం ఈ మిలియనీర్ $1.2 మిలియన్ల (రూ.98,877,900 ఇండియన్ కరెన్సీలో) బీచ్-ఫేసింగ్ ఇంటిని కొనుగోలు చేశాడు.. అతను $180,000 (రూ.1,46,84,109 ఇండియన్ కరెన్సీలో) విలువైన BMW M5ని నడుపుతాడు.. అతను కోరుకున్న దేశానికి తిరుగుతున్నాడు. తను ఫాలో అయిన ఫార్మూలాను అందరూ ఫాలో అవ్వండి అంటూ అందరికీ సలహాలు ఇస్తున్నాడు.