Pakistan Army : కరోనా కట్టడికి ఆర్మీని రంగంలోకి దింపిన పాక్

పాకిస్తాన్ లోనూ కరోనావైరస్ మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతోంది. కరోనా కేసుల తీవ్రత రోజురోజుకీ పెరిగిపోతోంది. కరోనా కట్టడి చేసేందుకు పాక్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

Pakistan Army Contain COVID-19 Spread : పాకిస్తాన్ లోనూ కరోనావైరస్ మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతోంది. కరోనా కేసుల తీవ్రత రోజురోజుకీ పెరిగిపోతోంది. కరోనా కట్టడి చేసేందుకు పాక్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దేశంలోని పలు నగరాల్లో కరోనా కట్టడికి ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆర్మీని రంగంలోకి దింపారు. భారతదేశం ప్రస్తుత కరోనా పరిస్థితుల నేపథ్యంలో పక్కదేశమైన పాక్ ముందుగానే ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందనే ఉద్దేశంతో ఈ దిశగా చర్యలు చేపట్టింది.

220 మిలియన్ల మంది జనాభా గల పాక్ లో కరోనా వ్యాప్తి తీవ్రత పెరిగిపోతోంది. ఈ క్రమంలో ప్రధాని ఖాన్ అత్యున్నస్థాయి అధికారులతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రస్తుత కరోనా విపత్కర పరిస్థితుల్లో పాక్ ఆర్మీ కూడా రంగంలోకి దింపాల్సిన అవసరం పడిందని తెలిపారు. కరోనా కట్టడిలో ఆర్మీ సైన్యం కూడా సాయపడాలని కోరారు.

ప్రతిఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించడమే కాకుండా సామాజిక దూరాన్ని పాటించేలా చర్యలు చేపట్టాల్సిందిగా పోలీసులకు సూచించారు. రాజధాని ఇస్లామాబాద్ సహా పలు నగరాల్లోని ఆస్పత్రులన్నీ కరోనా పేషంట్లతో కిటకిటలాడిపోతున్నాయి. గత ఏడాదిలో కరోనా ఆరంభమైనప్పటి నుంచి పాకిస్తాన్ లో 7లక్షల 84వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరణాలు 17వేల వరకు చేరాయి. తాజాగా దేశంలో గత 24 గంటల్లో శుక్రవారం నాటికి 144 కరోనా మరణాలు నమోదు కాగా.. కొత్తగా 5,900 కరోనా కేసులు నమోదయ్యాయి.

ట్రెండింగ్ వార్తలు