Pak National Assembly : ఇమ్రాన్ ఖాన్ గూగ్లీ .. జాతీయ అసెంబ్లీని రద్దు చేసిన అధ్యక్షులు

పాక్ లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రతిపక్షాలు ఊహించని ఘటనలు జరిగాయి. పాక్ ప్రధానిగా ఉన్న ఇమ్రాన్ ఖాన్ తెలివిగా వ్యవహరిస్తూ.. పావులు కదిపారు. ఏకంగా నేషనల్ అసెంబ్లీని...

Pakistan President : పాక్ లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రతిపక్షాలు ఊహించని ఘటనలు జరిగాయి. పాక్ ప్రధానిగా ఉన్న ఇమ్రాన్ ఖాన్ తెలివిగా వ్యవహరిస్తూ.. పావులు కదిపారు. ఏకంగా నేషనల్ అసెంబ్లీని రద్దు చేయాలని ప్రెసిడెంట్ ను ఇమ్రాన్ కోరడం.. వెంటనే జాతీయ అసెంబ్లీని రద్దు చేస్తున్నట్లు అధ్యక్షులు ప్రకటించడంతో విపక్ష నేతలు ఆశ్చర్యపోయారు. మూడు నెలల్లో ఎన్నికలు జరుగుతాయని తెలుస్తోంది. పాక్ ప్రధానిగా ఉన్న ఇమ్రాన్ ఖాన్ పై విపక్షాలు అవిశ్వాస తీర్మానం ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో 2022, ఏప్రిల్ 03వ తేదీ ఆదివారం అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరగాల్సి ఉంది. 11.30 గంటలకు ఓటింగ్ జరగాల్సి ఉంది.

Read More : Pak Election : పాక్‌‌లో త్వరలో ఎన్నికలు ?.. సిద్ధంగా ఉండాలన్న ఇమ్రాన్ ఖాన్

ముందుగా పీటీఐకి చెందిన 24 మంది ఎంపీలు ఇమ్రాన్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన సంగతి తెలిసిందే. కానీ.. పీటీఐ నుంచి అసలు ఎంపీలు హాజరు కాకపోవడం గమనార్హం. 22 మంది పీటీఐ సభ్యులే నేషనల్ అసెంబ్లీకి వచ్చారు. ఇమ్రాన్ వ్యతిరక వర్గంగా ఉన్న 176 మంది కూడా వచ్చారు. ఇక్కడే ఇమ్రాన్ అనూహ్యంగా పావులు కదిపారు. విపక్షాలు ఊహించని విధంగా ఆయన ఎత్తుకు పై ఎత్తు వేశారు. నేషనల్ అసెంబ్లీకి హాజరు కాకుండా.. పాక్ అధ్యక్షుడిని కలిశారు. ఈ పరిణామాన్ని ప్రతిపక్షాలు ఊహించలేదు. అసెంబ్లీని రద్దు చేయాలని రాష్ట్రపతిని కోరారు. అవిశ్వాసం జరగనివ్వకుండా ప్రతిపక్షాలు గెలవనీయకుండా తెలివిగా వ్యవహరించారు ఇమ్రాన్ ఖాన్.

Read More : Pakistan Political Crisis : నేడు తేలనున్న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భవితవ్యం

డిప్యూటీ స్పీకర్ సహకారంతో అవిశ్వాసం నుంచి తప్పించుకున్నారు ఇమ్రాన్. అవిశ్వాసంపై ఓటింగ్‌ను చేపట్టలేదు నేషనల్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్. దీంతో ఇమ్రాన్‌ పదవీగండం ప్రస్తుతానికి తప్పినట్టైంది. అయితే ఆయన నిర్ణయంపై ప్రతిపక్షాలు ఆందోళకు దిగాయి. దీంతో పాక్‌ నేషనల్‌ అసెంబ్లీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇమ్రాన్‌పై అవిశ్వాసం చేపట్టేవరకు సభ నుంచి కదలమంటున్నారు ప్రతిపక్ష పార్టీల సభ్యులు. దీనిపై సుప్రీంకోర్టులోనే తేల్చుకుంటామంటున్నారు. మరోవైపు ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు ఎన్నికలకు వెళ్లి తన సత్తా ఏంటో చూపిస్తానని చెప్పారు. తనను గద్దె దించడానికి విదేశీ కుట్ర జరుగుతోందని మరోసారి వ్యాఖ్యలు చేశారు. విదేశీ కుట్రదారుల ఎత్తులకు అనుగుణంగా పాక్ రాజకీయ నాయకులు నడుచుకుంటున్నారని తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు