Pak Election : పాక్‌‌లో త్వరలో ఎన్నికలు ?.. సిద్ధంగా ఉండాలన్న ఇమ్రాన్ ఖాన్

తీర్మానంపై డిప్యూటీ స్పీకర్ ఓటింగ్ చేపట్టకపోవడం గమనార్హం. ఈనెల 25వ తేదీ వరకు అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ నిలిపివేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.

Pak Election : పాక్‌‌లో త్వరలో ఎన్నికలు ?.. సిద్ధంగా ఉండాలన్న ఇమ్రాన్ ఖాన్

Imran Khan

Pakistan Deputy Speaker : పాకిస్థాన్ లో త్వరలో ఎన్నికలు జరుగనున్నాయా ? అనే చర్చ కొనసాగుతోంది. 2022, ఏప్రిల్ 03వ తేదీ ఆదివారం కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆయనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. కానీ.. ఈ తీర్మానంపై డిప్యూటీ స్పీకర్ ఓటింగ్ చేపట్టకపోవడం గమనార్హం. ఈనెల 25వ తేదీ వరకు అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ నిలిపివేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. ఒక్కసారిగా జరిగిన పరిణామాలతో విపక్షలు ఖంగుతిన్నాయి. ఓటింగ్ నిలిపివేతపై నేషనల్ అసెంబ్లీలో విపక్ష పార్టీలకు చెందిన నేతలు ఆందోళన చేపట్టాయి. దీంతో పాక్‌ నేషనల్‌ అసెంబ్లీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇమ్రాన్‌పై అవిశ్వాసం చేపట్టేవరకు సభ నుంచి కదలమంటున్నారు ప్రతిపక్ష పార్టీల సభ్యులు. దీనిపై సుప్రీంకోర్టులోనే తేల్చుకుంటామంటున్నారు. ఈ సందర్భంగా ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ.. డిప్యూటీ స్పీకర్ నిర్ణయంపై పాక్ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని, తనపై అవిశ్వాస తీర్మానం పెట్టడం విదేశీ కుట్రలో భాగమేనంటూ మరోసారి ఆరోపణలు చేశారు. నేషనల్ అసెంబ్లీని రద్దు చేయాలని ప్రెసిడెంట్ ను కోరారు ఇమ్రాన్. ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

Read More : Imran Khan: ఇమ్రాన్ ఖాన్‌కు కీలక డే.. అవిశ్వాసంలో నెగ్గేనా.. రోడ్లపైకొచ్చి నిరసన తెలపాలంటూ దేశ ప్రజలకు పిలుపు..

అందరూ ఊహించిందే జరిగింది. పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ చెప్పిందే చేశారు. నేషనల్ అసెంబ్లీని రద్దు చేసి.. ఎన్నికలకు వెళ్తామని చెప్పిన ఇమ్రాన్.. ఈ మేరకు పాక్‌ అధ్యక్షుడికి లేఖ పంపారు. నేషనల్ అసెంబ్లీని రద్దు చేయాలని అధ్యక్షుడిని కోరారు ఇమ్రాన్. దీంతో పాకిస్థాన్‌లో త్వరలోనే ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి పాక్ ప్రధానిగానే ఇమ్రాన్‌ఖాన్‌ కొనసాగనున్నారు. నేషనల్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్. నిర్ణయంతో ఇమ్రాన్‌ పదవీగండం ప్రస్తుతానికి తప్పినట్టైంది. ఈ ఉదయం 11 గంటల 30 నిమిషాలకు జరగాల్సిన ఓటింగ్‌కు పీటీఐ  (PTI) నుంచి అసలు ఎంపీలు హాజరుకాలేదు. కేవలం 22మంది పీటీఐ సభ్యులే నేషనల్‌ అసెంబ్లీకి వచ్చారు. అటు ఇమ్రాన్‌ వ్యతిరేక వర్గం నుంచి 176మంది సభ్యులు నేషనల్ అసెంబ్లీకి వచ్చారు.

Read More : Imran Khan: రాజీనామా చేయను.. మాపై ఓ దేశం కుట్ర చేస్తోంది: పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్

సభలో ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే ఇమ్రాన్‌ఖాన్‌ తెలివిగా పావులు కదిపారు. నేషనల్‌ అసెంబ్లీకి డుమ్మా కొట్టిన ఇమ్రాన్‌ అదే సమయంలో పాక్‌ అధ్యక్షుడిని కలిశారు. ఈ పరిణామాన్ని ప్రతిపక్షాలు ఊహించలేదు. అసెంబ్లీని రద్దు చేయాలని రాష్ట్రపతిని కోరారు ఇమ్రాన్‌. ఎన్నికలకు వెళ్లి తన సత్తా చూపిస్తానంటున్నారు. అవిశ్వాసం జరగనివ్వకుండా.. ప్రతిపక్షాలను గెలవనివ్వకుండా తెలివిగా వ్యవహారించారు ఇమ్రాన్‌. ఎన్నికల్లో తేల్చుకోవాలని డిసైడ్ అయ్యారు. త‌న‌ను గ‌ద్దె దించడానికి విదేశీ కుట్ర జ‌రుగుతుంద‌ని ఇమ్రాన్‌ఖాన్ మరోసారి ఆరోపించారు. విదేశీ కుట్రదారుల ఎత్తుల‌కు అనుగుణంగా పాకిస్థాన్ రాజ‌కీయ నాయ‌కులు న‌డుచుకుంటున్నార‌ని విమర్శించారు. మరి రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.