Imran Khan: రాజీనామా చేయను.. మాపై ఓ దేశం కుట్ర చేస్తోంది: పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్

కొందరు వ్యక్తులు విదేశీ శక్తులతో చేతులుకలిపి తనను గద్దె దించేందుకు కుట్రపన్నాయని తీవ్ర ఆరోపణలు చేసిన ఇమ్రాన్ ఖాన్..విదేశీ శక్తులతో పని చేస్తున్న ఆ ముగ్గురు తొత్తులు ఇక్కడ ఉన్నారంటూ

Imran Khan: రాజీనామా చేయను.. మాపై ఓ దేశం కుట్ర చేస్తోంది: పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్

Imran

Imran Khan: పాకిస్తాన్ ప్రధానిగా ఆదేశ పార్లమెంటులో అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొంటు..దాదాపుగా పదవి కోల్పోయే దశలో ఉన్న ఇమ్రాన్ ఖాన్..గురువారం కీలక ప్రసంగం చేశారు. ప్రస్తుతం పాకిస్తాన్ క్లిష్ట పరిస్థితుల్లో ఉందని..ఇటువంటి పరిస్థితుల్లో దేశ భవిష్యత్తుపై తగిన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని ఇమ్రాన్ పేర్కొన్నారు. అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో సీట్లు తగ్గడంపై ఇమ్రాన్ ఖాన్ స్పందిస్తూ తాను రాజీనామా చేయబోనని..చివరి బాల్ వరకు పోరాడుతానని అన్నారు. ఉన్నత స్థానం నుంచి పతనం వరకు పాకిస్తాన్ ఎత్తుపల్లాలను చూశానన్న ఇమ్రాన్ ఖాన్..తన చిన్నతనంలో పాకిస్తాన్ ఎంతో ఉన్నతంగా ఉండేదని వ్యాఖ్యానించారు. అభివృద్ధి విషయంలో ఇప్పుడు అభివృద్ధిలో దూసుకుపోతున్న దక్షిణ కొరియా వంటి దేశాలు ఒకప్పుడు పాకిస్తాన్ సాయం కోరిందని..ఇమ్రాన్ ఖాన్ అన్నారు. అటువంటి పాకిస్తాన్ ను తిరిగి అభివృద్ధిలో నడిపించాలన్న పూర్వీకుల ఆకాంక్షను నెరవేర్చేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని ఇమ్రాన్ ఖాన్ వివరించారు.

Also read:Hindu Country Nepal: నేపాల్ ను హిందూ దేశంగా ప్రకటించాలన్న డిమాండ్ కు సీనియర్ మంత్రి మద్దతు

పాకిస్తాన్ ముస్లింలు ఎన్నటికీ బానిసలుగా ఉండరని ఆయన అన్నారు. తాను మలేషియా రాజకుమారులతో కలిసి చదువుకున్నాన్న ఇమ్రాన్ ఖాన్.. “మంచి జీవితం కావాల్సినంత డబ్బుతో పాటు నాకు దేవుడు అన్ని ఇచ్చాడు..ఇప్పుడు నాకు దేనిపైనా వ్యామోహం లేదు” అంటూ చెప్పుకొచ్చారు. భారత్, అమెరికాలోనూ ఎంతో మంది మిత్రులున్నారని అన్న ఇమ్రాన్ ఖాన్.. ఆయా దేశాలతో తనకు ఎటువంటి శత్రుత్వం లేదని..కేవలం వారి విధివిధానాలను మాత్రమే ఖండించానని చెప్పుకొచ్చారు. తాను ప్రధాని అయ్యాక ఎవరితోను వ్యతిరేకంగా వెళ్లకూడదని నిశ్చయించుకున్నానని, కేవలం కాశ్మీర్ విషయంలోనే భారత్ తీరుతో వివాదం పెంచుకోవాల్సి వస్తుందని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. బర్ఖా దత్(ప్రముఖ న్యూస్ జర్నలిస్ట్) పుస్తకం ప్రకారం, నవాజ్ షరీఫ్ నేపాల్‌లో ప్రధాని మోదీని రహస్యంగా సమావేశం అయ్యారని ఇమ్రాన్ ఖాన్ వెల్లడించారు.

Also read:Delhi Kejriwal : దేశం కోసం చనిపోవడానికి సిద్ధంగా ఉన్నా

కొందరు వ్యక్తులు విదేశీ శక్తులతో చేతులుకలిపి తనను గద్దె దించేందుకు కుట్రపన్నాయని తీవ్ర ఆరోపణలు చేసిన ఇమ్రాన్ ఖాన్..విదేశీ శక్తులతో పని చేస్తున్న ఆ ముగ్గురు తొత్తులు ఇక్కడ కూర్చుని ఉన్నారంటూ సంచలన ప్రకటన చేశారు. “ఇమ్రాన్ ఖాన్‌ను తొలగించాలని ఆ స్థానంలో వారి అనునయుల్ని తీసుకోవాలని.. అప్పుడు అంతా బాగానే ఉంటుందని వారు కోరుకుంటున్నారు” అంటూ ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు. తనపై జరుగుతున్న కుట్రల ఆరోపణలపై ఇమ్రాన్ ఖాన్ స్పందిస్తూ.. విదేశాల నుంచి కొన్ని సందేశాలు వస్తున్నాయని..నన్ను గద్దె దించకపోతే పాకిస్తాన్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అదే ఇమ్రాన్ ఖాన్ దిగిపోతే పాకిస్తాన్ ను క్షమిస్తాం” అంటూ ఆ సందేశాల సారాంశంగా చెప్పుకొచ్చారు.

Also read:Russian Soldiers: కుక్కలను ఆహారంగా తింటున్న రష్యా సైనికులు.. రేడియోనే సాక్ష్యం