అయ్యో: న్యూస్ ఛానల్ లైవ్ డిబేట్ లో జారి పడిపోయిన గెస్ట్

టీవీలో లైవ్ లో జరుగుతున్న కొన్ని కార్యక్రమాల్లో అనుకోకుండా కొన్ని ఘటనలు జరుగుతుంటాయి. కొన్ని నవ్వు తెప్పిస్తే..మరికొన్ని కోపం తెప్పిస్తాయి. గతంలో అమెరికాలో భూకంపం సంభవించినప్పుడు ఓ ఛానల్లో వార్తలు చదువుతున్న యాంకర్ తీవ్ర భయాందోళనలకు గురైన నానా హంగామా చేసింది. ఈ వీడియో చూసినవారంత సరదాగా నవ్వుకున్నారు. కానీ పాక్ న్యూస్ ఛానల్ లో సెప్టెంబర్ 16న జరిగిన ఓ ఘటనపై మాత్రం నెటిజన్లు మండిపతున్నారు.
అది పాకిస్తాన్ జీటీవీ న్యాస్ ఛానల్. కశ్మీర్ అంశంపై భారత దేశం తీసుకున్న నిర్ణయం (ఆర్టికల్ 370 రద్దు) అంశంపై లైవ్ లో డిబేట్ జరుగుతోంది. ఈ డిబేట్ లో ఇద్దరు గెస్ట్ లు పాల్గొన్నారు. వారిలో ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు మజార్ బార్లాస్ పాల్గొన్నారు. చర్చ సీరియస్ గా కొనసాగుతోంది. అప్పుడే జరిగింది ఓ ఘటన. డిబేట్ ప్యానెల్‌లో కూర్చున్న విశ్లేషకుడు హఠాత్తుగా కుర్చీపై నుంచి కిందపడిపోయాడు. కానీ అక్కడే ఏమీ జరగనట్లే తోటి గెస్ట్ మిన్నకుండిపోయారు. అస్సలు స్పందించలేదు. కనీసం పక్కకు కూడా చూడలేదు.
దీని కంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే..డిబేట్ జరుపుతున్న యాంకర్ కూడా ఏమీ పట్టించులేదు. కనీసం అక్కడ నుంచి కదల్లేదు..సరికదా..నాలుక కరుచుకుంటూ విచిత్రమైన ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చాడు. చర్చలకు పిలిచిన గెస్ట్ లను ఛానల్ మేనేజ్ మెంట్ చూసుకోవాలి. యాంకర్ కూడా గెస్ట్ ల విషయంలో మర్యాదగా వ్యవహరించాలి. కానీ ఇక్కడ అలా జరగలేదు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన అందరూ యాంకర్ పై మండిపడుతున్నారు.నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. లైవ్ షోలో ఓ సీనియర్ విశ్లేషకులు కుర్చీ నుంచి పడిపోతే స్పందించకపోవటం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు.
@mazhar_barlas sir ap kay lagi tw nahi ziada ??@GTVNetworkHD jani wtf ? pic.twitter.com/iNY0Yfc7HM
— A S A D I S H A Q (@AsadIshaqHere) September 17, 2019