Pakistani women fighting for sarees
Pakistani women fighting for sarees : చీరలు అంటే చాలు భారతీయ మహిళలు ఎగబడిపోతారు అనే పేరుంది. భారత్ లో చీరలపై డిస్కౌంట్ ఇస్తున్నారంటే మహిళలు ఎగబడి మరీ కొంటారని..షాపులో చీరల కోసం కొట్టుకున్నారనే వార్తలు విన్నాం..సోషల్ మీడియాల్లో చూశాం.కానీ చీరలంటే భారత్ మహిళలకే కాదు పాకిస్థాన్ మహిళలకు కూడా చీరలంటే పిచ్చేనా..అనిపిస్తోంది ఓ వీడియో చూస్తుంటే పాకిస్థాన్ లో మహిళలు చీరల కోసం కొట్టుకున్నారు. దీంతో వారి భర్తలు పిస్టల్స్ పట్టుకుని రంగంలోకి దిగారు. కాల్పులతో హల్ చల్ చేశారు. దీంతో అక్కడ రచ్చ రచ్చగా మారిపోయింది వాతావరణం.చీరల కోసం వెళితే కాల్పులేంటిరా బాబు అనేలా గందరగోళం ఏర్పడింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. పాకిస్థాన్ లో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
worlds Richest woman : ఏకైక మహిళా చక్రవర్తి .. అందంలోనే కాదు ప్రపంచలోనే అత్యంత ధనవంతురాలు
భారతీయయ మహిళలకు మాత్రమే చీరలు పిచ్చి అనుకుంటే తప్పే అనేలా ఈ వీడియోని చూస్తే తెలుస్తుంది. పాకిస్తాన్ లోని ఓ షాపులో చీరల కొనుగోళ్ల విషయంలో మహిళల మధ్య గొడవ జరిగింది. ఎక్కడ మొదలైందో..ఎందుకు మొదలైందో..ఎలా మొదలైందో తెలీదుగానీ మహిళలు కొట్టుకోవడం మొదలు పెట్టారు..ఈక్రమంలో కొంతమంది మహిళలు కిందపడిపోయారు. దీంతో ఆ మహిళల భర్తలు కూడా ఇక్కడ జోక్యం చేసుకున్నారు. ఓ వ్యక్తి ఏకంగా చెప్పుతో ఇష్టమొచ్చినట్లుగా కొడుతున్నట్లు వీడియోలో కనిపిస్తోంది.
అక్కడ ఉన్న ఓ వ్యక్తి పిస్టల్స్ తీసుకుని కాల్పులు జరపటానికి రెడీ అయ్యాడు. దీంతో మహిళ అరుస్తు పరుగులు పెట్టారు. దీంతో అక్కడున్న కొంతమంది సదరు వ్యక్తి గట్టి పట్టుకుని ఆపారు. ఈ విషయం తెలిసిన పోలీసులు రంగంలోకి దిగారు. ఆరుగురిని అరెస్టు చేసారు.