NASA Spacecraft : సూర్యుడికి చేరువైన నాసా స్పేస్ క్రాఫ్ట్.. సౌర తుఫాన్ లపై ప్రత్యేక అధ్యయనం

తీవ్ర సౌర తుఫాను వల్ల ప్రపంచంలో కొన్ని నెలలపాటు ఇంటర్నెట్ పూర్తిగా స్తంభించే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితినే 'ఇంటర్నెట్ అపోకలిప్స్' అని అంటారు.

NASA spacecraft

Spacecraft Closed Sun : నాసా స్పేస్ క్రాఫ్ట్ సూర్యుడికి చేరువలో ఉంది. సూర్యుడికి చేరువైన పార్కర్ సోలార్ ప్రోబ్ స్పేస్ క్రాఫ్ట్ ను వినియోగించి సౌర తుఫాన్ లపై నాసా ప్రత్యేక అధ్యయనం చేస్తోంది. సూర్యుడి నుంచి ఉత్పన్నమయ్యే సౌర తుఫాన్ల ముప్పు భూమికి పొంచి ఉంది. రాబోయే దశాబ్ధంలో భూమిని తాకే అవకాశం ఉందని భావిస్తున్నారు.

తీవ్ర సౌర తుఫాను వల్ల ప్రపంచంలో కొన్ని నెలలపాటు ఇంటర్నెట్ పూర్తిగా స్తంభించే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితినే ‘ఇంటర్నెట్ అపోకలిప్స్’ అని అంటారు. దీని వల్ల ఉపగ్రహాలు, విద్యుత్ లైన్లకు ముప్పు ఏర్పడుతుంది.

Huge Mountains : భూమి లోపల భారీ పర్వతాలు.. భూమిపై ఉన్న మౌంట్ ఎవరెస్ట్ కన్నా నాలుగు రెట్లు ఎత్తైనవి

ఈ నేపథ్యంలో సౌర తుఫాన్లపై లోతైన అధ్యయనం చేస్తున్నట్లు కాలిఫోర్నియా యూనివర్సిటీ ప్రొఫెసర్ స్టువర్ట్ బేల్ పేర్కొన్నారు. సూర్యుడు విడుదల చేసే శక్తి, సమాచార వ్యవస్థలను దెబ్బతీయగలిగే భూ అయస్కాంత తుఫాన్ల గురించి తెలుసుకోవచ్చని తెలిపారు.