ప్రయాణీకుడి బట్టలు విప్పేసి..ప్లాస్టిక్ కవర్‌తో ప్యాక్ చేసి విమానంలో పడేసిన అధికారులు

ఎయిర్ పోర్ట్ సిబ్బంది ఓ ప్రయాణీకుడి పట్ల అత్యంత దారుణంగా ప్రవర్తించారు. ఎమ్మాన్యుయెల్ చెడ్జోవ్ అనే 47 ప్రయాణీకుడి బట్టలు విప్పేసి అతడిని ఓ ప్లాస్టిక్ కవర్లతో ఏకంగా మిఠాయి పొట్ల చుట్టేసినట్లుగా ప్యాక్ చేసేసి విమానంలో కుదేశారు. అతడు మెర్రో మెత్తో అని ఎంతగా అరచినా వారు వినిపించుకోలేదు.
వివరాల్లోకి వెళితే..కామెరూన్( పశ్చిమ, మధ్య ఆఫ్రికా మధ్య దేశం)కు చెందిన ఎమ్మాన్యుయెల్ చెడ్జోవ్ దుబాయ్‌కు ప్రయాణమయ్యాడు. అతను కామెరూన్ వాణిజ్య రాజధాని దౌలాలో చెప్పుల వ్యాపారం చేస్తుంటాడు.బిజినెస్ పనిమీద దుబాయ్‌కు వెళ్తూ..మధ్యలో ఇస్తాంబుల్ ఎయిర్‌పోర్ట్‌లో దిగాడు. అక్కడ.. చెడ్జోవ్ వీసాను తనిఖీ చేసిన టర్కీ ఇమ్మిగ్రేషన్ అధికారులు.. అది నకిలీదని గుర్తించారు. వెంటనే ఎమ్మాన్యుయెల్ ను అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్‌కు వెళ్లాల్సిన విమానంలో కాకుండా.. తిరిగి అతడి స్వదేశమైన కామెరూన్‌కు వెళ్లే విమానం ఎక్కించేందుకు యత్నించారు.
దీంతో అతను అధికారులతో వాగ్వాదానికి దిగాడు. తాను తిరిగి కామెరూన్‌కు వెళ్లబోననీ తేల్చి చెప్పాడు. తాను తన టికెట్ కోసం ట్రావెల్ ఏజెన్సీకి భారీగా డబ్బు కూడా చెల్లించానని చెప్పాడు. అయినా అధికారులు పట్టించుకోలేదు. అదంతా మాకు అనవసరం..మీరు తిరిగి కామెరూన్ వెళ్లాల్సిందేనంటూ..తెగేసి చెప్పారు.
అంతటితో ఊరుకోకుండా..ఎమ్మాన్యుయెల్ బట్టలు విప్పేసి..పార్శిల్ కోసం వాడే బబుల్ వ్రాప్ (చిన్న చిన్న బుడగల్లా ఉండే ప్లాస్టిక్ కవర్లు)తో అతడి శరీరాన్ని మిఠాయి పొట్లంలా ప్యాకింగ్ చేసినట్లుగా చుట్టేశారు. అతడి కాళ్లు చేతులు కదలకుండా కట్టేశారు. తరువాత అతడిని కామెరూన్ వెళ్లే విమానంలో బలవంతంగా కుర్చోబెట్టేందుకు నానా ప్రయత్నాలు చేశారు.
అయినా సరే ఎమ్మాన్యుయెల్ చెడ్జోవ్ నన్ను వదిలిపెట్టండీ అంటూ వేడుకున్నాడు. అయినా వాళ్లు వదల్లేదు.ఓ ప్రయాణీకుడి పట్ల ఇంత అరాచకంగా ప్రవర్తిస్తున్నారంటూ తోటి ప్రయాణికులు అధికారులను వారించినా ఫలితం లేకపోయింది. చివరికి.. ప్రయాణికులే చొరవతీసుకుని అతడి శరీరానికి చుట్టిన కవర్లను ఎంతో కష్టపడి విప్పారు. స్ట్రాంగా ఉండే ఆ ప్లాస్టిక కవర్ ను కట్ చేసే వస్తువులు తమ దగ్గర లేకపోవటం అటువంటివి విమానంలో కూడా లేకపోవటంతో ఎంతో కష్టంగా చేతులతోనే వాటిని తొలగించారు.
చెడ్జోవ్‌కు తోడుగా ఉన్న పార్టనర్ ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీంతో ఈ వీడియో క్షణాల్లో వైరల్‌గా మారింది. టర్కీ విమానాశ్రయ సిబ్బంది ప్రవర్తనపై నెటిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికులతో ప్రవర్తించే తీరు ఇదేనా అని ఫైర్ అవుతున్నారు.
Turkish Airlines ? pic.twitter.com/mms78x12Zu
— ??????? ?. ?. ????????? (@ThierryJFT) February 24, 2020