Pele Health Update : అత్యంత విషమంగా ఫుట్ బాల్ దిగ్గజం ఆరోగ్య పరిస్థితి

Pele Health Update : బ్రెజిల్ ఫుట్ బాల్ దిగ్గజం పీలే ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారినట్లు వార్తలు వస్తున్నాయి. గతేడాది పీలే పేగు క్యాన్సర్ బారిన పడ్డారు. డాక్టర్లు కణతిని తొలగించారు. కొన్ని రోజుల క్రితం మళ్లీ అనారోగ్యానికి గురి కావడంతో కుటుంబసభ్యులు పీలేని ఆసుపత్రిలో చేర్చారు. అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన కీమో థెరపీకి స్పందించడం లేదని డాక్టర్లు తెలిపారు. దీంతో ఆయన ఆరోగ్యం మరింత విషమించిందంటున్నారు.

లెజెండరీ బ్రెజిలియన్ ఫుట్‌బాల్ ఆటగాడు పీలే కీమోథెరపీ చికిత్సకు ప్రతిస్పందించడం లేదు. దీంతో ఆయన సౌ పాలో ఆసుపత్రిలో పాలియేటివ్ కేర్‌కు తరలించబడ్డారు. క్యాన్సర్ చికిత్స కోసం ఆయన మళ్లీ ఆసుపత్రిలో చేరారన్న డాక్టర్లు.. శ్వాసకోశ ఇన్ఫెక్షన్‌తో పీలే బాధపడుతున్నట్టు గుర్తించారు.

Also Read..Football Legend Pele : ఆసుపత్రిలో ఫుట్ బాల్ దిగ్గజం.. ఆందోళనలో అభిమానులు

కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న పీలే పరిస్థితి విషమించడంతో కుటుంబసభ్యులు ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ హాస్పిటల్‌లో చేర్చారు. శరీరం పై వాపులు రావడం వల్ల ఆయన ఆసుపత్రిలో చేరారు. దీనిపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేయగా.. పీలే కూతురు స్పందించారు. చికిత్స కోసమే తన తండ్రి పీలేను ఆసుపత్రిలో చేర్చామన్నారు. ఇందులో ఎమర్జెన్సీ ఏమీ లేదని, భయపడాల్సింది కూడా లేదని ఆమె స్పష్టం చేశారు. న్యూఇయర్‌ను నాన్నతో కలిసి సెలబ్రేట్‌ చేసుకుంటాము అని కూడా ఆమె ధీమా వ్యక్తం చేశారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

పీలే వయసు 82ఏళ్లు. గతేడాది సెప్టెంబర్‌లో ఆయన పెద్ద పేగు నుంచి ట్యూమర్‌ను తొలగించారు. అప్పటి నుంచి అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి. ఆసుపత్రిలో అడ్మిట్‌ అవుతున్నారు. కీమో థెరపీ కూడా నిర్వహిస్తున్నారు. ఆల్‌టైమ్‌ గ్రేట్‌ ఫుట్‌బాలర్స్‌లో ఒకడిగా పీలే పేరుగాంచారు. తన కెరీర్‌లో మొత్తం 1363 మ్యాచ్‌లు ఆడి 1279 గోల్స్‌ చేశాడు. ఇందులో ఫ్రెండ్లీ మ్యాచ్‌లు కూడా ఉన్నాయి. ఇదొక గిన్నిస్‌ రికార్డ్. బ్రెజిల్ తరఫున 92 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 77 గోల్స్‌ చేశాడు. పీలే.. మూడు వరల్డ్ కప్ లు గెలిచిన ఏకైక ఆటగాడిగా ఘనత సాధించాడు.

ట్రెండింగ్ వార్తలు